ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి లభించిదని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. దీన్ని పురస్కరించుకుని ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. ఢిల్లీ ప్రజలు చూపించిన విశ్వాసాన్ని అభివృద్ధి రూపంలో చూపిస్తామని పేర్కొన్నారు. బీజేపీపై ఉంచిన విశ్వాసానికి ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇకపై ఢిల్లీ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు. ఈ విజయం కోసం ప్రతి బీజేపీ కార్యకర్త కృషి చేశారని కొనియాడారు. ఈ ఎన్నికల్లో నిజమైన విజేతలు ఢిల్లీ ప్రజలేనని.. ఢిల్లీ ప్రజలు చూపించిన ప్రేమను తిరిగి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకున్నారని.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఢిల్లీని అభివృద్ధిలో నడిపిస్తామని పేర్కొన్నారు. ఢిల్లీని వికసిత్ రాజధానిగా మారుస్తామని తెలిపారు. 10 ఏళ్లు అహంకారంతో పాలించారని ఆప్‌పై మోడీ మండిపడ్డారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 48 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత హస్తినలో కమలం పార్టీ సర్కార్‌ను ఏర్పాటు చేయనుంది. ఇక ఆప్ 22 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక ఓటమిని కేజ్రీవాల్ స్వాగతించారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఘోర పరాజయం పాలయ్యారు.
#WATCH | "Yamuna Maiya ki Jai," says Prime Minister Narendra Modi as he begins his address at the party headquarters in Delhi
BJP emerged victorious in #DelhiAssemblyElection2025 pic.twitter.com/O5FIbhv2r7
— ANI (@ANI) February 8, 2025
#WATCH | Delhi BJP MPs felicitate Prime Minister Narendra Modi at the BJP headquarters as he joins the party's victory celebration.#DelhiAssemblyElection2025 pic.twitter.com/8JyelRq5vI
— ANI (@ANI) February 8, 2025
#WATCH | Union Minister and BJP National President JP Nadda felicitates Prime Minister Narendra Modi at the BJP headquarters as he joins party's victory celebration#DelhiAssemblyElection2025 pic.twitter.com/Pfy4ktDpBE
— ANI (@ANI) February 8, 2025
#WATCH | Delhi: Prime Minister Narendra Modi greets party workers and leaders present at the BJP headquarters to celebrate the party's victory in #DelhiAssemblyElection2025 pic.twitter.com/jWywfSTYbC
— ANI (@ANI) February 8, 2025
#WATCH | Prime Minister Narendra Modi receives a grand welcome as he arrives at the BJP headquarters in Delhi to celebrate the party's victory in #DelhiAssemblyElection2025 pic.twitter.com/QgnsB5khTn
— ANI (@ANI) February 8, 2025
#WATCH | Prime Minister Narendra Modi receives a grand welcome as he arrives at the BJP headquarters in Delhi to celebrate party's victory in #DelhiAssemblyElection2025 pic.twitter.com/ruOdT3CqLl
— ANI (@ANI) February 8, 2025