దేశ రాజధాని ఢిల్లీ పీఠాన్ని మొత్తానికి 27 ఏళ్ల తర్వాత కమలం పార్టీ కైవసం చేసుకుంది. తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 48, ఆప్ 22 సీట్లు గెలుచుకున్నాయి. ఇక కేజ్రీవాల్ ఓటమి చెందడం ఆప్ పార్టీకి ఘోర పరాభవంగా చెప్పొచ్చు.
ఇది కూడా చదవండి: Komatireddy Venkat Reddy: కేటీఆర్ వాఖ్యలను తిప్పికొట్టిన మంత్రి కోమటిరెడ్డి..
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టేజీపై ఉండగా ఒక బీజేపీ అభ్యర్థి వచ్చి కాళ్లు మొక్కుతారు. వెంటనే ప్రధాని మోడీ కూడా అభ్యర్థి కాళ్లు మొక్కారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మరోసారి ఆయన పేరు సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. ఆ అభ్యర్థి గెలిచాడా? ఓడిపోయాడా? అని చర్చిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Under 1Lakh Bike : లక్ష కంటే తక్కువ ధరలో లభించే బజాజ్ పల్సర్ లేదా హీరో ఎక్స్‌ట్రీమ్.. ఏది కొనడం బెస్ట్ ?
రవీంద్ర సింగ్ నేగి.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పట్పర్‌గంజ్ స్థానం నుంచి పోటీ చేశారు. ఇతడి కాళ్లకు మోడీ మొక్కారు. ఇక తాజా ఫలితాల్లో రవీంద్ర సింగ్ నేగి ఘన విజయం సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అవధ్ ఓజాను 23 వేల 280 ఓట్ల తేడాతో ఓడించారు. 2013 నుంచి పట్పర్‌గంజ్ స్థానాన్ని ఆప్ కంచుకోటగా చేసుకుంది. ఇక 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మనీష్ సిసోడియా ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు రవీంద్ర సింగ్ నేగి.. కేవలం 2 శాతం ఓట్లతో సిసోడియాపై ఓడిపోయారు. తాజా ఫలితాల్లో మాత్రం రవీంద్ర సింగ్ నేగి.. ఆప్ కంచుకోటను బద్ధలు కొట్టారు. భారీ విజయంతో గెలుపొంది హిస్టరీ సృష్టించారు.
VIDEO | Delhi Elections 2025: PM Modi (@narendramodi) meets BJP candidates during 'Sankalp Rally' at Kartar Nagar.#DelhiElectionsWithPTI #DelhiElections2025
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/H3sM0z63h3
— Press Trust of India (@PTI_News) January 29, 2025