ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయం ఆసన్నమైంది. ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రారంభ ట్రెండ్స్‌లో బీజేపీ ముందంజలో ఉంది. ఆప్ కూడా గట్టి పోటీ ఇస్తోంది. చాలా మంది సీనియర్ ఆప్ నాయకులు వెనుకబడి ఉన్నారు. ఢిల్లీలో మొత్తం 70 సీట్లు ఉండగా, మెజారిటీకి 36 సీట్లు అవసరం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వరుసగా మూడోసారి గెలుస్తుందా? రాజధానిలో బీజేపీ 27 ఏళ్ల తర్వాత వికసిస్తోందా? అనేది తేలనుంది. అదే…
రోహిణి అసెంబ్లీ స్థానానికి తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. ఆప్ అభ్యర్థి ప్రదీప్ మిట్టల్ కు 3235 ఓట్లు, బీజేపీ అభ్యర్థి విజేంద్ర గుప్తా కు 3187 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సుమేష్ కు 177 ఓట్లు వచ్చాయి. 48 ఓట్ల ఆధిక్యంలో ఆప్ అభ్యర్థి కొనసాగుతున్నారు.
ఢిల్లీలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది.. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కావస్తోంది.. ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ మెజార్టీ మార్కును దాటింది. బీజేపీ 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 26 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. READ MORE: Saurabh Bharadwaj: ఆప్‌ని లేకుండా చేసే ప్రయత్నం జరిగింది.. మరోవైపు ముస్లిం ప్రభావిత నియోజకవర్గం ఓఖ్లాలో 70 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది..…
Delhi Election Results 2025 Live Updates: దేశ రాజధానిలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఆమ్ ఆద్మీ పార్టీ.. ఆ పార్టీని గద్దె దించి 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఢిల్లీ పాలనా పగ్గాలు దక్కించుకోవాలన్న కసితో భారతీయ జనతా పార్టీ!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. దేశ వ్యాప్తంగా ఢిల్లీ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఈసారి ఏ పార్టీ గెలుస్తుందోనన్న ఉత్కంఠ రేపుతోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి.
Delhi Election : ఢిల్లీలో ఓట్ల లెక్కింపుకు ఒక రోజు ముందు, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల సంఘంపై ప్రశ్నలు సంధించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లోని ఒక పోస్ట్‌లో పదే పదే అభ్యర్థించినప్పటికీ,
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థుల కొనుగోలు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. 16 మంది ఆప్ అభ్యర్థుల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ శనివారం జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. రేపు (శనివారం) ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాలకు ముందే అభ్యర్థుల కొనుగోలు ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఎవరికి గుణపాఠం నేర్పిస్తున్నాయి. ఎవరికి లాభం చేకూరుస్తున్నాయి. తేలాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. హస్తినలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.