ఢిల్లీలో ఉత్కంఠకు తెరపడింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం చేస్తూ కమలం వికసించింది. ఆప్ కు పట్టున్న ప్రాంతాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించటం.. ఆ పార్టీ వ్యూహానికి అద్దం పడుతోంది. ఆప్ దిగ్గజాల్ని ఓటమి బాట పట్టించిన ఢిల్లీ ఓటర్లు.. కాషాయ పార్టీకి రాచబాట వేశారు. ఢిల్లీ అభివృద్ధికి గ్యారంటీ ఇచ్చిన మోడీ.. ఉచిత పథకాల విషయంలోనూ తగ్గలేదు. మరిప్పుుడు బీజేపీ ఎలాంటి పాలనా విధానం తీసుకొస్తుందనేది చూడాల్సి ఉంది.
Rahul Gandhi: ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ‘‘మద్యం కుంభకోణానికి మూలకర్త’’ అని దుయ్యబట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం రాహుల్ గాంధీ పట్పర్ గంజ్లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
వింటర్ సీజన్‌లో దేశ రాజధాని ఢిల్లీలో వాడివేడి విమర్శలతో రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
Delhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. ఫిబ్రవరి 05న ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంది. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి షాక్ తగిలింది. ఆప్‌కి చెందిన పలువురు కార్యకర్తలు, నేతలు బీజేపీలో చేరారు.
Arvind Kejriwal: ఢిల్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అధికార ఆప్, బీజేపీ మధ్య విమర్శల వెల్లువ కొనసాగుతోంది. ఫిబ్రవరి 5న ఢిల్లోలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే, ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు సం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు లిక్కర్ పాలసీ వ్యవహారం తాజాగా మరోసారి కాక రేపుతోంది. మద్యం పాలసీ కారణంగా ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా కాగ్ పేర్కొన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ కూడా సరికొత్త పథకాలను ప్రకటిస్తోంది. తాజాగా ‘‘జీవన్ రక్షా యోజన’’ కింద రూ. 25 లక్షల ఆరోగ్య భద్రత పథకాన్ని హస్తం పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ పథకాన్ని ప్రకటించారు.
BJP- AAP Poster War: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓటర్లను ఆకర్షించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ వినూత్న ప్రచారానికి తెర లేపాయి.
రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ సొంత బలంతోనే ముందుకు వెళ్లనుందని ఆప్ చీఫ్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.