సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని 5 రహదారులను (రిచర్డ్‌సన్ రోడ్, ప్రోట్నీ రోడ్, బయామ్ రోడ్, అమ్ముగూడ రోడ్, అల్బయిన్ రోడ్) సామాన్య ప్రజల వినియోగానికి తెరిచేందుకు రక్షణ శాఖ అనుమతించడం పట్ల కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకుగానూ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కేద్రం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప అస్వస్థత కారణంగా పరీక్షలు చేయగా.. రాజ్ నాథ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు.
కేంద్ర ప్రవేశపెట్టిన ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ‘ అగ్నిపథ్ ’పై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. బీహార్,తెలంగాణ, యూపీ,హర్యానా, తమిళనాడు, గుజరాత్ ఇలా పలు రాష్ట్రాల్లో ఆర్మీ ఆశావహులు, యువత ఆందోళనలు చేశారు. బీహార్, తెలంగాణల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా బీహార్ లో రైల్వే ఆస్తులే లక్ష్యంగా పలు రైళ్లకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. స్టేషన్లను ధ్వసం చేశారు. తెలంగాణ సికింద్రాబాద్లో కూడా హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఆందోళనల్లో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఇదిలా ఉంటే…
అగ్నిపథ్ స్కీమ్ పై నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బీహార్ లో హింసాత్మక ఘటనలు తగ్గడం లేదు. శనివారం భారత్ బంద్ కు బీహార్ విద్యార్థులు పిలుపునిచ్చారు. శనివారం కూడా చాలా ప్రాంతాల్లో హింసాత్మక ఘటలను జరిగాయి. మరోవైపు బీజేపీ ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లే .. అగ్నిపథ్ ను కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.…
భారత సైన్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, జీతం, పెన్షన్ బిల్లులను తగ్గించడంతో పాటు ఆధునాతన ఆయుధాలను సేకరణ కోసం నిధులను ఖర్చు చేయాలనే లక్ష్యంతో అగ్నిపథ్ పథకాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, దేశ త్రివిధ దళాల అధిపతులతో కలిసి ప్రకటించారు. రాజ్ నాథ్ సంగ్ ఇది చారిత్రక నిర్ణయం అని అన్నారు. అగ్నిపథ్ పథకంలోని ముఖ్యాంశాలు: పథకం కింద 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసు ఉన్న 45,000 మంది యువతీయువకులను…
ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖలు రాశారు. విజయవాడ, విశాఖ, తిరుపతి విమానాశ్రయాల అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో విస్తరణ అంశాల పై వేర్వేరుగా సీఎం జగన్ లేఖలు రాశారు. ఏపీ ఆర్ధిక అభివృద్ధిలో విశాఖ నగరం కీలకపాత్ర పోషిస్తోందని ఆయన లేఖలో పేర్కొన్నారు. పర్యాటక కేంద్రంగా, పారిశ్రామికంగా ఈ నగరం నుంచి విమానాల రాకపోకలకు పెద్ద ఎత్తున…
ఉక్రెయిన్, రష్యా మధ్య క్షణక్షణానికి పరిస్థితులు మారుతున్నాయి. ఉక్రెయిన్‌లో నెలకొన్ని గందరగోళ పరిస్థితుల్లో అక్కడి చిక్కకున్న భారత పౌరులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా బలగాలు సమీపిస్తున్నాయని ఆయన అన్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వ భవనాలను ఆధీనంలోకి తీసుకోవాలని రష్యా యోచినలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలని భారత్ భావిస్తోందని ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్‌లో…
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు నిరసన సెగ తగిలింది.. ఇవాళ గోండా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తుండగా.. కొందరు యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.. వెంటనే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.. ఇక, యువత నిరసనపై స్పందించిన రాజ్‌నాథ్ సింద్.. న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చి శాంతింపజేశారు.. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే హోళీ, దీపావళి పండుగలకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్…
తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది సాయుధ బలగాల ఆకస్మిక మరణం తీవ్ర వేదనకు గురిచేసింది అన్నారు. ఆయన అకాల మరణం మన సైనిక బలగాలకు, దేశానికి తీరని లోటు. జనరల్ రావత్ అసాధారణమైన ధైర్యం, శ్రద్ధతో దేశానికి సేవ చేశారు. మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా రావత్ మన…
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని మాజీ సైనికుల పెండింగ్ సమస్యలను ఆ లేఖ ద్వారా రాజ్‌నాథ్ దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, సోము వీర్రాజు.. రాజ్‌నాథ్ సింగ్‌కు రాసిన లేఖలో పేర్కొన్న ముఖ్యమైన అంశాల విషయానికి వస్తే.. ఆర్మీ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్‌ను విజయవాడలో ఏర్పాటు చేయాలని కోరారు.. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా మాజీ సైనికుల వాహనాలకు…