తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది సాయుధ బలగాల ఆకస్మిక మరణం తీవ్ర వేదనకు గురిచేసింది అన్నారు. ఆయన అకాల మరణం మన సైనిక బలగాలకు, దేశానికి తీరని లోటు. జనరల్ రావత్ అసాధారణమైన ధైర్యం, శ్రద్ధతో దేశానికి సేవ చేశారు. మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా రావత్ మన సాయుధ దళాల ఉమ్మడి ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రస్తుతం వెల్లింగ్టన్‌లోని మిలిటరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు రక్షణ శాఖ మంత్రి.