కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డీప్ ఫేక్ వీడియోను షేర్ చేసినందుకు చిరాగ్ పటేల్ అనే వ్యక్తిపై గుజరాత్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు గుజరాత్ మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. కేంద్రమంత్రిపై ఉద్దేశపూర్వకంగా డీప్‌ఫేక్ వీడియో చేసినట్లుగా హర్ష్ సంఘవి పేర్కొన్నారు.
ఈ డిజిటల్ యుగంలో, డీప్ఫేక్ టెక్నాలజీ పెరుగుదల వల్ల నిజమైన, నకిలీని గుర్తించడం మరింత సవాలుగా మారింది. డీప్ఫేక్ ఫోటోలు, వీడియోలు అనేవి కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఒకరి ముఖాన్ని మరొక వ్యక్తి శరీరంపై అతికించడానికి లేదా వారి రూపాన్ని వాస్తవిక పద్ధతిలో మార్చడానికి సృష్టించబడిన మానిప్యులేటెడ్ మీడియా. ఈ అధునాతన నకిలీలను కంటితో గుర్తించడం కాస్త కష్టం. కానీ ఫోటో లేదా వీడియో తారుమారు చేయబడిందో లేదో తెలుసుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. డీప్ ఫేక్…
Rashmika Deep Fake Video : టాలీవుడ్ హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప చిత్రంతో బాలీవుడ్‌లో తన ఉనికిని చాటుకుంది. ఆ తర్వాత నేషనల్ క్రష్ అయిపోయింది.
జాతీయ స్థాయిలో రిజర్వేషన్ల అంశంపై రాజకీయ రచ్చ నడుస్తుంటే, ఫేక్ వీడియోలు అంతకంటే జోరుగా సర్క్యులేట్ అవుతున్నాయి. మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లన్నీ తొలగిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నట్లుగా ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కలకలం రేపింది.
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్‌ఫేక్ వీడియోలు బాలీవుడ్ నటులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఆయా పార్టీలకు మద్దతు తెల్పుతున్నట్లుగా నకిలీ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో వదలుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ బాలీవుడ్ నటులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నటులు ఆయా పార్టీలకు ప్రచారం చేస్తున్నట్లు డీప్‌ఫేక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
UP CM Yogi Adityanath Deepfake Video: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘డీప్‌ఫేక్ వీడియోస్’ సంచలనంగా మారాయి. ఇప్పటికే ఎందరో సెలెబ్రిటీలు డీప్‌ఫేక్ వీడియోస్ బారిన పడ్డారు. కృత్రిమ మేధను ఉపయోగించి సృష్టిస్తున్న ఈ వీడియోలపై ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాజానికి ముప్పుగా మారుతున్న ఇలాంటి వీడియోలు, ఫొటోల కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టినా.. ఎలాంటి ప్రయోజనం లేదు. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ డీప్‌ఫేక్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. డయాబెటిస్ ఔషధానికి సీఎం…
Deepfake video: ఇటీవల కాలంలో దేశంలో ప్రముఖుల డీప్‌ఫేక్ వీడియోలో ఆందోళన కలిగిస్తు్న్నాయి. ఏఐ టెక్నాలజీ సాయంతో వీడియోలను మార్ఫింగ్ చేస్తున్నారు. గతంలో రష్మికా మందన్న, కత్రినా కైఫ్, కాజోల్ వంటి మూవీ స్టార్స్ డీప్‌ఫేక్‌కి బారినపడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా క్రికెట్ స్టార్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా డీప్‌ఫేక్ బాధితుడయ్యారు. సచిన్ ఆన్‌లైన్ గేమ్‌ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వాయిస్‌తో ఓ వీడియో వైరల్ అవుతోంది. డీప్‌పేక్ టెక్నాలజీతో ఈ వీడియోను రూపొందించారు. దీనిపై…
ఇటీవల సినీ తారల డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.. అవి సోషల్ మీడియాలో ఎంత దుమారం రేపాయో తెలిసిందే.. నిందితులు మొదట నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను టార్గెట్ చేశారు. మొన్నటి వరకు ఆమెకు సంబంధించిన బ్లాక్ డ్రెస్ డీప్ ఫేక్ వీడియో నెట్టింట వీడియో చక్కర్లు కొట్టింది.. ఆ తర్వాత పలు ప్రముఖ హీరోయిన్ల వీడియోలను కూడా రిలీజ్ చేశారు.. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా…