డీప్‌ఫేక్ వీడియోలు మరోసారి కలకలం రేపాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ పేరిట డీప్‌ఫేక్ వీడియోలు అలజడి సృష్టించాయి. ఇన్వెస్టర్లకు సలహాలు ఇస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలపై ఆర్బీఐ స్పందించింది. ఇలాంటి వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: Pushpa 2 : టెన్షన్ లేకుండా పుష్ప ఈవెంట్.. మొత్తం అంతా వాళ్లే చేశారు!
వీడియోలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతున్నట్లుగా ఉన్న డీప్‌ఫేక్ వీడియోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా కొన్ని పెట్టుబడి పథకాలు తెస్తున్నట్లుగా.. ఫలానా పథకంలో పొదుపు చేసుకోవాలంటూ సలహాలు ఇస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు ఆర్బీఐ దృష్టికి రావడంతో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచించింది. సదరు వీడియోలతో ఆర్బీఐ అధికారులకు ఎలాంటి సంబంధం లేదని, అవన్నీ ఫేక్ వీడియోలు అంటూ స్పష్టంచేసింది. ఆర్బీఐ ఎప్పుడూ పెట్టుబడులకు సంబంధించిన సలహాలు ఇవ్వబోదని తేల్చిచెప్పింది.
ఇది కూడా చదవండి: Pushpa 2 : పుష్ప గాడి సత్తా చూపించే ప్లాన్ రెడీ చేసిన మైత్రి
గతంలో కూడా ఇలాంటి డీప్‌ఫైక్ వీడియోలు కలకలం రేపాయి. ప్రముఖ నాయకులు, నటుల వీడియోలు హల్‌చల్ చేశాయి. దీంతో ఆయా ప్రముఖుల అప్రమత్తతతో కొట్టిపారేశారు. అలాంటి వీడియోలు నమ్మొద్దని సూచించారు. సోషల్ మీడియా విచ్చలవిడి పెరిగిన తర్వాత.. ఇలాంటి ఫేక్ వార్తలు బాగా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Asian Champions Trophy-2024: వారెవ్వా.. జపాన్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్