సార్వత్రిక ఎన్నికల వేళ బాలీవుడ్ నటులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నటులు ఆయా పార్టీలకు ప్రచారం చేస్తున్నట్లు డీప్‌ఫేక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల అమీర్‌ఖాన్‌కు చెందిన ఓ వీడియో ఇలానే వైరల్ అయింది. దీంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీకి ప్రచారం చేయడం లేదని.. ఇదంతా తప్పుడు ప్రచారం అని కొట్టిపారేశారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా మరో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌కు చెందిన ఏఐ జనరేటెడ్ వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందులో ఆయన ఒక రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నట్టుగా ఉంది.
ఇది కూడా చదవండి: AP Elections 2024: ఇప్పటి వరకు 44,163 మంది వాలంటీర్ల రాజీనామా..
ఇటీవల రణ్‌వీర్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించారు. అక్కడి నమోఘాట్ దగ్గర ఆయనతో పాటు నటి కృతిసనన్ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. అంతకముందు కాశీ విశ్వనాథుడిని సందర్శించుకున్నారు. తర్వాత ఆధ్యాత్మిక నగరంలో పొందిన అనుభూతిని మీడియాకు వివరించారు. ఆ దృశ్యాలనే వాడిన ఏఐ వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో ఆయన ఒక పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్టుగా కనిపించింది. ఈ వీడియోపై రణ్‌వీర్ సింగ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి:Jithender Reddy : లచ్చిమక్క అంటున్న మంగ్లీ.. మరో మాసీ నెంబర్ తో వచ్చేసింది!
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. కొందరు నటులు ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. కానీ పోటీ చేయని నటుల వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయా పార్టీలకు ప్రచారం చేస్తున్నట్లుగా డీప్‌ఫేక్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే అమీర్‌ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజా వీడియోపై రణ్‌వీర్ సింగ్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
https://twitter.com/SujataIndia1st/status/1780625636924547314