YS Sharmila: ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వినతిపత్రం అందించారు.
సోనియాగాంధీ ఆదేశాలతో సత్యగ్రహ దీక్ష జరుగుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి వెల్లడించారు. అగ్నిపథ్‌పై పార్లమెంట్‌లో చర్చించకుండా యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆమె మండిపడ్డారు. మోదీ తీసుకొచ్చిన ప్రతి పథకం తన స్నేహితులు అదానీ, అంబానీల కోసమేనని ఆరోపణలు చేశారు. శ్రీలంకలో కూడా మోదీ అదానీకి సహకరించేలా ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. మాకు అగ్నిపథ్ వద్దని విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని ఆమె తెలిపారు. అగ్నిపథ్‌తో రక్షణ శాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్…
ఆదిలాబాద్ జిల్లా గూడెం వాసులు గుక్కెడు నీటికోసం తిప్పలు పడుతున్నారు..రోడ్డు సౌకర్యం లేక అల్లాడిపోతున్నారు..ఏళ్లు గడిచినా ఎవ్వరు పట్టించుకోకపోవడంతో గోస పడుతున్నారు ..చివరికి జిల్లా కలెక్టరేట్ కు మొరపెట్టుకోవడం కోసం గూడెం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు..అయినా స్పందించకపోవడం మూడు రోజులుగా కలెక్టరేట్ ముందు దీక్షకు దిగారు.. ఇదిగో ఇది ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కుండిషేక్ గూడెం ఇది.. గూడెం వాసులకు తాగునీటికోసం తంటాలుపడాల్సిన పరిస్థితి..ఊర్లో బోరు లేదు..పొలాల్లో ఉండే అల్లంతదూరంలోని బావి…
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేసిన చరిత్ర సోనియాగాంధీది. వైద్యం కోసం ఆరోగ్య శ్రీ తెచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్. రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అంటే మమ్మల్ని నమ్మలేదు జనం. ఒకసారి లక్ష మాఫీ చేస్తాం అని చెప్పిన కేసీఆర్‌ని నమ్మి ఓటేశారు. రైతులు నమ్మి ఓటేస్తే రుణమాఫీ ఇప్పటికీ జరగలేదన్నారు జగ్గారెడ్డి.
టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై దాడి తర్వాత రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ శ్రేణుల దాడులకు నిరసనగా రేపటి నుంచి చంద్రబాబు నిరవధిక నిరసన దీక్షకు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు బాబు. రేపు ఉదయం 8 గంటల నుంచి 36 గంటల పాటు చంద్రబాబు దీక్ష కొనసాగనుంది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు దీక్షకు దిగుతున్నారు చంద్రబాబు. పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు దీక్షకు అన్ని…