సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేసిన చరిత్ర సోనియాగాంధీది. వైద్యం కోసం ఆరోగ్య శ్రీ తెచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్. రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అంటే మమ్మల్ని నమ్మలేదు జనం. ఒకసారి లక్ష మాఫీ చేస్తాం అని చెప్పిన కేసీఆర్‌ని నమ్మి ఓటేశారు. రైతులు నమ్మి ఓటేస్తే రుణమాఫీ ఇప్పటికీ జరగలేదన్నారు జగ్గారెడ్డి.