టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై దాడి తర్వాత రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ శ్రేణుల దాడులకు నిరసనగా రేపటి నుంచి చంద్రబాబు నిరవధిక నిరసన దీక్షకు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు బాబు. రేపు ఉదయం 8 గంటల నుంచి 36 గంటల పాటు చంద్రబాబు దీక్ష కొనసాగనుంది.
శుక్రవారం రాత్రి 8 గంటల వరకు దీక్షకు దిగుతున్నారు చంద్రబాబు. పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు దీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. న్యాయ నిపుణులతో రెండు గంటల నుంచి చర్చలు జరిపిన టీడీపీ నేతలు నిర్ణయానికి వచ్చారు.
పార్టీ క్యాడర్ కు దగ్గరగా ఉండాలని నాయకులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని సూచనలు చేశారు. చంద్రబాబు దీక్షకు సిద్ధం కావడంతో పరిస్థితి ఏవిధంగా మారుతుందోనన్న ఉత్కంఠ ఏపీలో నెలకొంది.