MLC Kavitha: భారత్ జాగృతి తలపెట్టిన దీక్షకు పోలీస్ శాఖ అనుమతి లభించింది. నేడు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు దీక్ష కొనసాగనుంది. ప్రభుత్వ నియామకాల్లో జీవో 3 వల్ల మహిళలకు రిజర్వేషన్ల అమలులో అన్యాయం జరుగుతోందని భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా చౌక్‌లో దీక్ష చేపట్టనున్నారు. జీవో 3 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత.
Read Also: Edupayala Jatara: నేటి నుంచి ఏడు పాయల జాతర.. భారీగా తరలివస్తున్న భక్తులు
భారత జాగృతి దీక్షకు అనుమతి ఇవ్వాలని డీజీపీ రవి గుప్తాకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నియామకాల్లో జీవో 3 వల్ల మహిళలకు రిజర్వేషన్ల అమలులో జరుగుతున్న అన్యాయంపై ఎమ్మెల్సీ కవిత దీక్ష తలపెట్టారు. శాంతియుతంగానే తాము దీక్ష చేపడుతామని డీజీపీకి కవిత తెలిపారు.