Women Reservations Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు సహకరిస్తాం: సీతారాం ఏచూరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్షకు సీపీఎం మద్దతు ప్రకటించింది. ఈ ధర్నాలో పాల్గొన్న సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.. చట్టసభల్లో మహిళలకు సరైన భాగస్వామ్యం లేనంత వరకు మన సమాజం ముందుకు వెళ్లదని చెప్పారు. రిజర్వేషన్ల సాధన కోసం కవిత అడుగు వేశారని ప్రశంసించారు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న తర్వాత మహిళా రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిందని ఆయన గుర్తు చేశారు. కానీ ఇంత వరకు లోక్ సభలో ఆమోదం పొందలేకపోయిందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు గతంలో మోదీ కూడా మద్దతు తెలిపారని గుర్తు చేశారు. అయినప్పటికీ ఆయన ప్రధాని అయి తొమ్మిదేళ్లు పూర్తవుతున్నా బిల్లును లోక్ సభలో పెట్టలేదని విమర్శించారు.ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనైనా మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని ఏచూరి కోరారు. మహిళా రిజర్వేషన్ కోసం చేసే పోరాటంలో తాము పాల్గొంటామని ఏచూరి స్పష్టం చేశారు.
Aslo Read : Sumalatha: ప్రధాని మోదీకే నా ఫుల్ సపోర్ట్.. బీజేపీకి సినీనటి, ఎంపీ సుమలత మద్దతు
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Delhi CNG Blast: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సీఎన్జీ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
- PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
కాగా, మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేపట్టారు. మహిళా రిజర్వేషన్లు సాధించేవరకు పోరాటబాట విడిచేది లేదని కవిత స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 27ఏళ్లుగా పెండింగ్‌లో ఉందన్న ఆమె… 1996లో దేవెగౌడ హయాంలో బిల్లు పెట్టినా ఇంకా చట్టం కాలేదని తెలిపారు. కేంద్రంలో పూర్తి మద్దతు ఉన్న బీజేపీ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడితే అన్ని పక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తామని కవిత ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు వచ్చే వరకూ తమ పోరాటాన్ని విడిచే ప్రసక్తే లేదని కవిత స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
DoT New SIM Rules 2026: కొత్త SIM Card తీసుకోవాలనుకుంటున్నారా? DoT కొత్త రూల్స్ ఇవే.. పూర్తి వివరాలు
-
Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్‌లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్‌కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!