తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముగింట అన్నాడీఎంకేలో విభేదాలు మరింత ముదురుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత సెంగోట్టయన్‌పై మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి యాక్షన్ తీసుకున్నారు. పార్టీ పదవుల నుంచి తొలగించారు.
చట్టసభల్లో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి పెండింగ్‌లో పెడుతున్నారు. దీంతో ఈ వివాదం బాగా ముదురుతోంది. ఇటీవల తమిళనాడు గవర్నర్-రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇలాంటి రగడే జరిగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టుకు చిక్కులు తప్పేలా కనిపిస్తున్నాయి. ముంబై - అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి జపాన్, భారతదేశంలో చాలా విషయాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.
ప్రస్తుత భారతదేశంలో ఏ పనైనా సరే ఒక వ్యక్తి ఉనికిని గుర్తించడానికి ఉపయోగపడే మొదటి కార్డు ఆధార్ కార్డు. భారతదేశంలో ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటేనే ఏ పనైనా ముందుకు సాగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రభుత్వ పథకాలకైనా సరే., ఏదైనా ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ కు సంబంధించి విషయమైనా సరే.. ఆధార్ తప్పనిసరి. ఆధార్ అప్డేట్ కోసం ఆన్లైన్లో మార్పులు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గడువు తేదీని పొడిగించింది. Pushpa 2 :…
పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించడంలో కొనసాగిన హైడ్రామాకు తెరపడింది. కోర్టు హెచ్చరికల నేపథ్యంలో బెంగాల్ పోలీసులు ఎట్టకేలకు అతడిని సీబీఐకి అప్పగించారు.
తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించి అప్డేట్ ఇచ్చింది. రూ.2,500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగించింది. వచ్చే నెల మూడో తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
రూ. 2వేల నోటు శనివారం తర్వాత మామూలు కాగితంతో సమాన విలువను కలిగి ఉంటుంది. రూ. 2000 నోటును శనివారం అంటే సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఏదైనా బ్యాంక్‌లో మార్చుకోకపోతే అది మరొక కాగితం మాత్రమే అవుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం స్పష్టం చేసింది.
ప్టెంబర్ నెల ముగియడానికి, రూ.2000 నోటు పూర్తిగా కనుమరుగు కావడానికి ఇంకా ఒకరోజే మిగిలి ఉంది. రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించడంతోపాటు ఆ నోట్ల మార్పిడికి సెప్టెంబరు 30వ తేదీని తుది గడువుగా విధించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మీ’ పథకానికి సంబంధించి ఆర్ అండ్ బీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సాయం అందించే గృహలక్ష్మీ పథకానికి ఎలాంటి గడువు లేదని మంత్రి స్పష్టం చేశారు.