ప్రస్తుత భారతదేశంలో ఏ పనైనా సరే ఒక వ్యక్తి ఉనికిని గుర్తించడానికి ఉపయోగపడే మొదటి కార్డు ఆధార్ కార్డు. భారతదేశంలో ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటేనే ఏ పనైనా ముందుకు సాగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రభుత్వ పథకాలకైనా సరే., ఏదైనా ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ కు సంబంధించి విషయమైనా సరే.. ఆధార్ తప్పనిసరి. ఆధార్ అప్డేట్ కోసం ఆన్లైన్లో మార్పులు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గడువు తేదీని పొడిగించింది.
Pushpa 2 : పుష్ప 2 తప్పుకోవడంతో పోటీలోకి వచ్చిన ఆ రెండు సినిమాలు..?
ఇదివరకు జూన్ 14న ఈ ఆధార్ కార్డు ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేసే విధానానికి చివరి తేదీ ఉండగా.. తాజాగా ఆ తేదీని సెప్టెంబర్ 14వ తేదీ వరకు పొడిగించింది. బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ డేటా సరిగా ఉండాలన్న సదుద్దేశంతో ఆధార్ అప్డేట్ తేదిని పొడిగించినట్లు యుఐడిఏఐ తెలిపింది. ఇకపోతే ప్రస్తుతం అప్డేట్ చేసుకోవడానికి కేవలం ఆధార్ కార్డులో ఉన్న పుట్టినరోజు, వయసు, అడ్రస్, లింగం, మొబైల్ నెంబర్, ఈమెయిల్, అడ్రస్, రిలేషన్షిప్ స్టేటస్ లాంటివి మాత్రమే అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
PM Modi: ముగిసిన ప్రధాని ఇటలీ పర్యటన.. ఢిల్లీకి చేరుకున్న మోడీ
ఇక ఆన్లైన్లో జరిగే ఆధార్ అప్డేట్ లో ఐరిస్ స్కానర్లు, ఫింగర్ ప్రింట్స్, ఫోటోగ్రాఫ్ లను మార్పుకు సంబంధించి ఈ సదుపాయాన్ని అందించలేదు. పుట్టిన తేదీ మార్చి విషయంలో కూడా ఓ కండిషన్ ఉంచారు. అదేంటంటే.. ఆధార్ రిజిస్టర్ చేసిన తేదీ నుంచి కేవలం మూడేళ్ల వరకు మాత్రమే పుట్టిన తేదీని మార్చుకునే అవకాశాన్ని కల్పించారు. అలాగే జెండర్ విషయంలో కూడా కేవలం ఒక్కసారి మాత్రమే మార్పు చేసుకొనేలా షరతులు వేధించారు. కాబట్టి మీలో ఎవరైనా ఆన్లైన్లో చేయగలిగే మార్పుల కోసం మరింత సమయాన్ని అందించింది యుఐడిఏఐ.