విదేశీ మందుల విషయంలో కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా.. యూరోపియన్ యూనియన్ (EU)లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ఔషధం విజయవంతమై అక్కడ డ్రగ్ రెగ్యులేటర్ నుండి అనుమతి పొందినట్లయితే.. ఆ ఔషధానికి భారత్ లో క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదని తెలిపింది. అంటే తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన మందులను కూడా నేరుగా భారతదేశంలోనే విక్రయించవచ్చు.
QR Code on Medicines: మీరు తీసుకున్న మెడిసిన్స్ నకిలీవని ఎప్పుడన్నా అనిపించిందా? ఇప్పుడు మీకు ఇప్పుడు అలాంటి భయం నుంచి విముక్తి లభిస్తుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తోంది.
కొవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ నివారణ కోసం ఒమిక్రాన్ ఎంఆర్‌ఎన్‌ఎ ఆధారిత బూస్టర్ వ్యాక్సిన్‌ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శనివారం ప్రారంభించారు. జెమ్ కొవాక్ ఒమ్(GEMCOVAC-OM) అనేది భారత దేశానికి చెందిన మొట్టమొదటి ఎంఆర్‌ఎన్‌ఎ ఆధారిత వ్యాక్సిన్.
18 Pharma Companies To Lose Licenses Over Poor Quality Medicines: దేశవ్యాప్తంగా నకిలీ ఔషధ కంపెనీలపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. 20 రాష్ట్రాల్లో మొత్తం 76 ఫార్మాస్యూటికల్ కంపెనీలపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీసీఐ) దాడులు నిర్వహించింది. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న 18 కంపెనీల లైసెన్సులు రద్దు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
నిబంధనలను ఉల్లంఘించి ఆన్‌లైన్‌లో ఔషధ విక్రయాలపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) షోకాజ్ నోటీసులు జారీ చేసిన 20 మంది ఆన్‌లైన్ విక్రేతలలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ కూడా ఉన్నాయి.
Centre's Panel Recommends Market Clearance To Covovax As Covid Booster: కరోనా మహమ్మారిపై పోరులో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ సమర్థవంతంగా పనిచేస్తోంది. ఇప్పటికే దేశంలోని ప్రజలందరికీ ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ అందించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య దాదాపుగా తగ్గింది. ఇదిలా ఉంటే ప్రస్తుత చైనాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోసులు వేసుకోవాలని కేంద్రం కోరుతోంది.
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా 'ఇన్‌కొవాక్'ను బూస్టర్ డోస్‌గా వినియోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత అనుమతి ప్రకారం ఇప్పటివరకు రెండు డోసుల కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారు 6నెలల తర్వాత బూస్టర్ డోస్‌గా ఈ చుక్కల మందు టీకా తీసుకోవచ్చు.
దేశంలో కార్బెవాక్స్ హెటిరోలాజస్ కోవిడ్-19 వ్యాక్సిన్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( డీజీసీఐ) బూస్టర్ డోస్ అనుమతి ఇచ్చింది. దేశంలో తొలిసారిగా బూస్టర్ డోస్ అనుమతి పొందిన హెటెరోలాజస్ డ్రగ్ గా కార్బెవాక్స్ నిలిచింది. హైదరాబాద్ కు చెందిన డ్రగ్ మేకర్ బయోలాజికల్-ఈ సంస్థ కార్బెవాక్ ను తయారు చేస్తోంది. ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన అంతకన్నా ఎక్కువ వయసు గల వ్యక్తులు ఈ బూస్టర్ డోస్ తీసుకునేందుకు మార్గం సుగమమైంది. రెండు…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది… ఇక, క్రమంగా ఏజ్ గ్రూప్‌ను తగ్గిస్తూ.. వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగిస్తోంది ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో చిన్నారుల వ్యాక్సిన్‌పై గుడ్‌న్యూస్ చెప్పింది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)… సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కోవోవాక్స్ కొవిడ్ టీకాకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది డీసీజీఐ. ఈ విషయాన్ని సీరం సీఈవో అదర్ పునావాలా తెలిపారు.. 12 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సిన్ వేసేందుకు…