Centre’s Panel Recommends Market Clearance To Covovax As Covid Booster: కరోనా మహమ్మారిపై పోరులో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ సమర్థవంతంగా పనిచేస్తోంది. ఇప్పటికే దేశంలోని ప్రజలందరికీ ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ అందించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య దాదాపుగా తగ్గింది. ఇదిలా ఉంటే ప్రస్తుత చైనాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోసులు వేసుకోవాలని కేంద్రం కోరుతోంది.
Read Also: Video Call Trap: సెక్స్ వీడియో కాల్ ట్రాప్‌లో వ్యాపారవేత్త.. ఏకంగా రూ. 2 కోట్లు సమర్పయామి
ఇదిలా ఉంటే కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ నిపుణుల బృందం కొత్తగా మరో వ్యాక్సిన్ ను బూస్టర్ డోసుగా సిఫార్సు చేసింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిడ్ వ్యాక్సిన్ కోవోవాక్స్‌కు మార్కెట్ అనుమతి ఇవ్వాలని కేంద్రం గురువారం సిఫార్సు చేశారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ (ప్రభుత్వ మరియు నియంత్రణ వ్యవహారాలు) ప్రకాష్ కుమార్ సింగ్ ఇటీవల 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి కోవోవాక్స్ హెటెరోలాగస్ బూస్టర్ డోస్ ఆమోదం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI)కి లేఖ రాశారు. సీడీఎస్సీఓ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ బుధవారం దీనిపై చర్చించాయి. కోవిషీల్డ్, కోవాక్సిన్ రెండు రకాల వ్యాక్సిన్ డోసులు తీసుకున్న పెద్దలకు హెటెరోలాగస్ బూస్టర్ డోసుగా కోవోవాక్స్ ను మార్కెట్ అనుమతి కోసం సిఫార్సు చేసింది.
డిసెంబరు 28, 2021న పెద్దవారిలో, మార్చి 9, 2022న 12-17 ఏళ్ల వయస్సులో ఉన్నవారిలో కొన్ని షరతులకు లోబడి జూన్ 28, 2022న 7-11 ఏళ్ల లోపు పిల్లల్లో అత్యవసర పరిస్థితుల్లో కోవోవాక్స్ ఇవ్వడానికి డీసీజీఐ ఆమోదం తెలిపింది.