Omicron: ఒమిక్రాన్ ఎంఆర్‌ఎన్‌ఏ బూస్టర్ వ్యాక్సిన్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Omicron: కొవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ నివారణ కోసం ఒమిక్రాన్ ఎంఆర్‌ఎన్‌ఎ ఆధారిత బూస్టర్ వ్యాక్సిన్‌ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శనివారం ప్రారంభించారు. జెమ్ కొవాక్ ఒమ్(GEMCOVAC-OM) అనేది భారత దేశానికి చెందిన మొట్టమొదటి ఎంఆర్‌ఎన్‌ఎ ఆధారిత వ్యాక్సిన్. స్వదేశీ సాంకేతికతతో జెనోవా దీనిని అభివృద్ధి చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ), బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చి అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్‌ఎసీ) నిధులు సమకూర్చాయి. సాధారణ ఉష్ణోగ్రతల స్థాయిలో ఈ వ్యాక్సిన్ నిల్వ చేయవచ్చు. అలాగే దేశంలో ఎక్కడికైనా రవాణా చేయవచ్చు . సూది, సిరంజీ అవసరం లేకుండా ఈ ఇంజెక్షన్‌ను ఇవ్వవచ్చని మంత్రి జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా వివరించారు.
Also Read: Parshottam Rupala: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే.. కేంద్రమంత్రి రూపాల
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
కొన్ని రోజుల క్రితం, ఈ టీకా అత్యవసర వినియోగ అనుమతి కోసం డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) కార్యాలయం నుంచి ఆమోదం పొందింది. రోగులు ఎవరైనా కొవిషీల్డ్, కొవాక్సిన్ టీకాలు వేయించుకున్నా బూస్టర్ డోస్‌గా ఈ ఒమిక్రాన్ వ్యాక్సిన్‌ను వేసుకోవచ్చు. ఎంఆర్‌ఎన్‌ఎ ఆధారిత ఇతర వ్యాక్సిన్ల మాదిరిగా ఈ వ్యాక్సిన్‌కు అతిశీతల సరఫరా వ్యవస్థ అవసరం లేదు. దేశంలో ఎక్కడికైనా ఎటువంటి ఉష్ణోగ్రతల్లో నైనా సరఫరా చేయవచ్చు. సంప్రదాయ సిరంజీలు, సూదులు అవసరం లేకుండా ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు. వేగంగా అందుబాటు లోకి తీసుకురాడానికి తాము చేసిన ప్రయత్నాలకు ఈ అనుమతి రావడమే సాక్షంగా జెనోవా బయోఫార్మాక్యూటికల్స్ సంస్థ సీఈవో సంజయ్ సింగ్ చెప్పారు. సాధారణంగా వ్యాక్సిన్ల సరఫరాకు దేశంలో 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు సౌకర్యం కల్పించ వలసి ఉంటుంది. కానీ ఈ బూస్టర్ ఒమిక్రాన్ వ్యాక్సిన్‌కు సరఫరా చేయాలన్నా నిల్వ చేయాలన్నా అతిశీతల ఉష్ణోగ్రత పరిస్థితి అవసరం లేదని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.
Also Read: Facial Hair Removal: ముఖంపై ఉన్న చిన్న చిన్న రోమాలతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేయండి మళ్లీ రావు..!
ఎంఆర్‌ఎన్‌ఎ ఆధారిత డిసీజ్ డయాగ్నోస్టిక్ ప్లాట్‌ఫారం టెక్నాలజీ ఉపయోగించి ఈ జెమ్ కొవాక్ ఒమ్ వ్యాక్సిన్‌ను తయారు చేయడమైందని డీబీటీ సెక్రటరీ, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చి అసిస్టెన్స్ కౌన్సిల్ (బిఐఆర్‌ఎసి) ఛైర్‌పర్సన్ రాజేష్ ఎస్ గోఖలే వెల్లడించారు. ఇదే టెక్నాలజీతో మరికొన్ని వ్యాక్సిన్లను త్వరలో తయారు చేస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!