కరోనాకు మరో టీకా అందుబాటులోకి వస్తోంది. బయోలాజికల్-ఈ సంస్థకు చెందిన కార్బెవాక్స్ వ్యాక్సిన్అత్యవసర అనుమతికి డ్రగ్స్కంట్రోలర్ జనరల్ ఆఫ్ఇండియా తుది అనుమతులు ఇచ్చింది. 12-18 ఏళ్ల పిల్లలకు రెండు డోసులుగా ఈ టీకాను వేస్తారు. 5 కోట్ల కార్బెవాక్స్ డోసుల కోసం ఆ సంస్థకు ఇటీవల కేంద్రం ఆర్డర్ పెట్టింది. ఒక్కో డోసును 145 రూపాయలుగా నిర్ణయించింది. దీనికి జీఎస్‌టీ అదనం. ఈ డోసులను ఫిబ్రవరి చివరి నాటికి సంస్థ సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది. Read Also:…
దేశంలో కరోనా మహమ్మారి కోసం అనేక వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో వ్యాక్సినేషన్ వేగంగా అమలుచేస్తున్నారు. 15 సంవత్సరాల వయసున్న వారి నుంచి వయోవృద్ధుల వరకు వ్యాక్సిన్లను అందిస్తున్నారు. ప్రస్తుతం 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు వారికి కూడా వ్యాక్సిన్లు అందిస్తున్నారు. అయితే, 15 ఏళ్ల లోపున్న పిల్లలకు ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. ఇదే ఇప్పుడు అందర్ని ఆలోచింపజేసింది. స్కూళ్లు ఓపెన్ కావడంతో పిల్లలను స్కూళ్లకు ఎలా…
కరోనా కట్టడి కోసం దేశీయ వ్యాక్సిన్లతో పాటు.. విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చింది భారత్.. రెండు డోసుల వ్యాక్సిన్ల తర్వాత.. ఇప్పుడు బూస్టర్ డోసును కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే కాగా.. ఇప్పుడు.. సింగిల్ డోస్ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చింది.. స్పుత్నిక్ లైట్ కోవిడ్-19 వ్యాక్సిన్‌కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ సింగిల్ డోసు టీకాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు…
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్‌పెట్టేందుకు కీలక ఆయుధంగా పనిచేస్తోంది వ్యాక్సినేషన్.. భారత్‌లో దేశీయంగా తయారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్‌కు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. ఇతర దేశాలకు కూడా సరఫరా చేసింది.. ఇక, ఇప్పుడు విస్తృతంగా వ్యాక్సినేషన్ జరగుతోంది.. ఈ సమయంలో ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. బహిరంగ మార్కెట్లో కోవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు విక్రయించేందుకు అనుమతి ఇచ్చింది భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ).. అయితే కొన్ని షరతులు కూడా విధించింది.. ఇక, డీసీజీఐ నుంచి అనుమతులు…
ప్రపంచాన్ని మరోసారి ఓమిక్రాన్ రూపంలో కరోనా భయపెడుతోంది. ఇప్పటికే 50 పైగా దేశాలకు వ్యాపించింది. 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఓమిక్రాన్ కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం అన్ని దేశాల్లో మరోసారి వ్యాక్సిన్ ప్రాముఖ్యత ఏర్పడింది. ఇప్పటికే వ్యాక్సిన్ డోసులు తీసుకున్నా.. బూస్టర్ డోసులు వేయాలని ప్రతిపాదనలు చేస్తున్నాయి పలు దేశాలు. ఇండియాలో కూడా బూస్టర్ డోసులపై నిర్ణయం తీసుకోవాలని పలు రాష్ట్రాలు, కేంద్రాన్ని కోరాయి. వైద్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్…
భారత్‌లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షలాదిమందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. కోవాగ్జిన్, కోవీషీల్డ్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. 18 ఏళ్లు పైబడిన వారికి ప్రస్తుతం వ్యాక్సిన్ అందిస్తున్నారు. కాగా, 18 ఏళ్ల లోపున్న వారికి వ్యాక్సిన్ అందించేందుకు భారత్ బయోటెక్ సిద్ధం అవుతున్నది. ఇప్పటికే చిన్నారుల కోసం తయారు చేసిన కోవాగ్జిన్ టీకాకు సంబంధించిన ట్రయల్స్‌ను భారత్ బయోటెక్ సంస్థ పూర్తిచేసింది. ఈ ట్రయల్స్ కు సంబంధించిన డేటాను భారత ఔషద…
ఇప్పటికే ఇండియాలో మూడు రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీ టీకాలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఈ మూడు వ్యాక్సిన్లు 18 ఏళ్లు నిండిన వారికి ఇస్తున్నారు. కరోనా నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నారు. కాగా, ఇటీవలే మరో మూడు వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి అనుమతి కోసం ధరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో దేశీయంగా తయారైన జైడస్ క్యాడిలా కంపెనీకి…
దేశంలో కరోనా కేసులు మళ్లీ భయపెడుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉంది. ఈతరుణంలో టీకా కొరతను అధిగమించడానికి మిశ్రమ మోతాదులపై ఫోకస్ పెట్టాయి కంపెనీలు, అధ్యయన సంస్ధలు. ఈ క్రమంలోనే కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్ల మిక్సింగ్‌పై అధ్యయనానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది. దీంతో తమిళనాడులోని వెల్లూర్ మెడికల్ కాలేజీ ట్రయల్స్ నిర్వహించనుంది. జులై-29న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కి చెందిన నిపుణుల కమిటీ ఈ అధ్యయానికి సిఫారసు చేసింది. కరోనా వ్యాక్సిన్లు అయిన.. కోవాగ్జిన్,…
కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మరో వ్యాక్సిన్ మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రాబోతున్నది. అయితే, దేశంలో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండటం, థర్డ్ వేవ్ చిన్నారిపై ఎఫెక్ట్ చూపుతుందని నిపుణులు హెచ్చరించడంతో చిన్నారుల్లో కరోనా వైరస్ ను అడ్డుకోవడం కోసం భారత్ బైయోటెక్ కంపెనీ చిన్నారుల వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నది. ఈ వ్యాక్సిన్ కు సంబంధించి 2,3 దశల క్లినికల్ ట్రయల్స్ కోసం డిసీజీఐ అనుమతి ఇచ్చింది. 525…