CCTV footage shows Darshan’s Jeep at Renuka Swami Murder spot : రేణుకా స్వామి హత్య కేసు దర్యాప్తును బెంగళూరు నగర పోలీసులు ముమ్మరం చేశారు. నటుడు దర్శన్, పవిత్ర గౌడతో పాటు మొత్తం 13 మంది నిందితులను హత్య జరిగిన ప్రదేశానికి తీసుకొచ్చి సీన్ కన్స్ట్రక్షన్ చేశారు. బుధవారం రేణుకాస్వామి హత్య కేసును పోలీసులు రెండోసారి విచారిస్తున్నారు. ఉదయం రేణుకాస్వామి మృతదేహాన్ని పడేసిన సుమనహళ్లి సమీపంలోని అనుగ్రహ్ అపార్ట్‌మెంట్ సమీపంలోని కల్వర్టు దగ్గర…
Sandalwood Actor Darshan Arrested in Murder Case: ఓ యువకుడి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీపను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం మైసూరులో దర్శన్‌తో పాటు మరో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో విచారణ నిమిత్తం వారిని బెంగళూరుకు తరలించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిత్రదుర్గలోని లక్ష్మీ వెంకటేశ్వర బరంగయ్‌లో నివాసం ఉంటున్న రేణుకా స్వామి…
అయోధ్య రాంలల్లా దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. రామజన్మోత్సవం పురస్కరించుకుని నాలుగురోజుల పాటు దర్శనం, హారతి పాస్ లు రద్దు చేశారు. అందుకు సంబంధించి రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సమాచారం అందించారు. రామజన్మోత్సవం ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో నిమగ్నమైన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. రామ నవమి రోజున మంగళ హారతి, అభిషేకం, అలంకరణ, రామ్ లల్లా దర్శనం యధావిథిగా కొనసాగుతుందని తెలిపారు.
కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన కాటేరా చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. గత ఏడాది డిసెంబర్ 29వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ యాక్షన్ మూవీ అద్భుత విజయం సాధించింది.కన్నడలో మాత్రమే విడుదలైన ఈ మూవీ రూ.100కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి సత్తా చాటింది.ఇదిలా ఉంటే కాటేరా చిత్రం ఇప్పుడు ఓటీటీలో కూడా దూసుకెళుతోంది. కాటేరా చిత్రం ఫిబ్రవరి 9వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ కి…
ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ నటించిన కన్నడ మూవీ కాటేరా..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీకి పోటీగా రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా వసూళ్లతో సంచలనం సృష్టించింది.తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫమ్ అయింది. ఫిబ్రవరి 9న దర్శన్ బర్త్‌డే నుంచే మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.కన్నడలో సలార్ మూవీకి పోటీగా డిసెంబర్ 29న కాటేరా మూవీ రిలీజైంది. సలార్ వంటి పెద్ద సినిమాతో ఎందుకు…
Pavitra Gowda: కన్నడ స్టార్ హీరో దర్శన్ ఎఫైర్ ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. హీరోయిన్ పవిత్ర గౌడతో దర్శన్ పదేళ్లుగా రిలేషన్ లో ఉన్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకొని కలిసి ఉంటున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి.
అయోధ్యలోని రామమందిరంలో కొలువుదీరిన బాలరాముడు ఇకపై 'బాలక్ రామ్' గా దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. మందిరంలో కొలువుదీరిన రామ్ లల్లా ఐదేళ్ల పసిబాలుడిగా దర్శనమిస్తున్నారు. అందుకే బాలక్ రామ్ పేరును నిర్ణయించినట్లు చెప్పారు. అంతేకాకుండా.. ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్ గా పిలుస్తామని తెలిపారు.
రేపటి నుంచి నీల మేఘ శ్యాముడు భక్త జన కోటికి దర్శనం ఇవ్వనున్నారు. మంగళవారం నుంచి సామాన్య భక్తులకు బాలరాముడు దర్శనం ఇవ్వనున్నారు. బాలరాముడి దర్శించుకునేందుకు ఆలయ ట్రస్ట్ రెండు స్లాట్స్ ఖరారు చేసింది. ఉదయం 7 గంటల నుంచి 11: 30 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకునేందుకు అనుమతించనున్నారు.
Kaatera: ఒకప్పుడు కన్నడ సినిమాల గురించి కానీ, కన్నడ హీరోల గురించి కానీ టాలీవుడ్ లో చాలాతక్కువ మందికి తెలుసు. కానీ, ఎప్పుడైతే కెజిఎఫ్ వచ్చిందో.. పాన్ ఇండియా లెవల్లో సినిమా ప్రేక్షకులు అందరూ ఒక్కటిగా మారారు కథ బావుంటే.. ఎలాంటి సినిమా అయినా చూస్తామని నిరూపించారు.