Darshan Crime Story Becamme Hot Topic in Social media: కన్నడ సినీ పరిశ్రమలో చాలెంజింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న దర్శన్ అరెస్ట్ వ్యవహారం ఆయన అభిమానులందరికీ షాక్ కలిగిస్తోంది. మొదటి నుంచి వివాదాస్పద నేపథ్యం ఉన్న దర్శన్ తాజాగా తన అభిమానిని కొట్టి చంపిన ఆరోపణల మీద అరెస్టు అయ్యాడు. ప్రస్తుతం కోర్టు వారం రోజుల రిమాండ్ విధించింది. దర్శన్ కి 2000 సంవత్సరంలో విజయలక్ష్మి అనే మహిళతో వివాహం అయింది. అయితే అప్పటినుంచి దర్శన్ ఆయన భార్య మధ్య సఖ్యత అయితే లేదు. అప్పట్లో నిఖిత అనే నటితో దర్శన్ సహజీవనం చేయగా భార్య ఫిర్యాదు మేరకు ఆమెను కన్నడ సినీ పరిశ్రమ బ్యాన్ కూడా చేసింది. అయినా తగ్గకుండా దర్శన్ నిఖితతో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపి తర్వాత సైలెంట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా పలు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిన దాఖలాలు ఉన్నట్టుగా కన్నడ మీడియా నివేదిస్తోంది.
Akhil Akkineni : రేయ్ అఖిల్ ఏంట్రా? ఇలా ఉన్నాడు!!
ఆ సంగతి అలా ఉంచితే ప్రస్తుతం ఆయన భార్యకు దూరంగా ఉంటూ పవిత్ర గౌడ అనే కన్నడ హీరోయిన్ తో సహజీవనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన రేణుక స్వామి అనే ఒక అభిమాని పవిత్ర గౌడ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోల మీద అసభ్యంగా కామెంట్ చేసేవాడు. దర్శన్ తన భార్యతో విడిపోవడానికి పవిత్ర కారణమని భావిస్తూ ఆయనని విడిచి పెట్టాలని బూతులతో బెదిరించేవాడు. ఈ విషయాన్ని కొన్నాళ్లపాటు సహించిన పవిత్ర దర్శన్ చివరికి అతనికి వార్నింగ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. దర్శన్ తన అభిమాన సంఘం నాయకుల చేత రేణుక స్వామిని కిడ్నాప్ చేయించి బెంగళూరులోని తన అభిమానికి చెందిన ఒక గోడౌన్ కి తీసుకువచ్చారు.
అక్కడ రేణుక స్వామి మీద దాడి చేయడమే కాదు చివరికి చంపేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రేణుక స్వామి మృతదేహాన్ని దగ్గర్లోనే ఒక చెరువులో డంప్ చేశారు. దానిని ప్రస్తుతానికి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేణుక స్వామిని హత్య చేస్తున్న సమయంలో అక్కడే దర్శన్ పవిత్ర ఉన్నట్టుగా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు కనిపెట్టారు. ఈ నేపథ్యంలోనే కోర్టులో ప్రొడ్యూస్ చేయగా కోర్టు వారికి వారం రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపద్యంలో సీన్ రీకన్ స్ట్రక్షన్ కూడా చేశారు. అయితే దర్శన్ కోసం పొలిటికల్ ప్రెజర్ పెరుగుతోందనే వార్తల నేపథ్యంలో కన్నడ హోం మంత్రి అలాంటిదేమీ లేదని దర్శన్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పుకొచ్చారు. ఒక హీరో తాను డేటింగ్ చేస్తున్న హీరోయిన్ ని అభిమాని తిట్టాడని కిడ్నాప్ చేయించడం, అతని మీద దాడి చేసి చంపడం చూస్తుంటే ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ లాగా అనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.