Pavitra Gowda: కన్నడ స్టార్ హీరో దర్శన్ ఎఫైర్ ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. హీరోయిన్ పవిత్ర గౌడతో దర్శన్ పదేళ్లుగా రిలేషన్ లో ఉన్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకొని కలిసి ఉంటున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మధ్యే పవిత్ర ఒక పోస్ట్ పెట్టింది. పదేళ్లు వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోస్ ను వీడియో రూపంలో పెట్టి.. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక అది చూసిన దర్శన్ భార్య విజయలక్ష్మీ రచ్చ చేయడం మొదలుపెట్టింది. పవిత్ర సెట్ కు వెళ్లి ఆమెను చెడామడా తిట్టేసి వచ్చేసినట్లు, తన భర్తను వదిలేయమని సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తరువాత పవిత్రను సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు. పచ్చని కాపురంలో నిప్పులు పోసావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. పవిత్ర కు పుట్టిన కూతురు కూడా దర్శన్ వలనే అని చెప్పుకొచ్చారు.
ఇక దీంతో పవిత్ర తన ఆవేదనను మొత్తం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ” నా పేరు పవిత్ర గౌడ. దర్శన్, నేను పదేళ్లుగా రిలేషన్ లో ఉన్నాం. ఈ విషయం అతని భార్య విజయలక్ష్మీకి కూడా తెలుసు.. మేము ఫోన్ లలో కూడా మాట్లాడుకొనేవాళ్ళం. మేమిద్దరం కలిసి ఉంటున్నందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. సరైన సమయం వచ్చినప్పుడు అందుకు తగిన ఆధారాలు చూపిస్తాను. ఇక నాకు ముందే సంజయ్ అనే వ్యక్తితో పెళ్లి అయ్యింది. మాకు పుట్టిన పాపనే ఖుషి. మా ఇద్దరి మధ్య విబేధాల వలన మేము విడిపోయాము. నా మొదటి పెళ్లికి సంబంధించిన విడాకుల పత్రాలు కూడా చూపిస్తాను. నా గురించి విజయలక్ష్మీ చాలా తప్పుగా మాట్లాడుతుంది.. నన్ను, నా కూతురిని తప్పు పడుతున్నారు. నన్ను ప్రేమిస్తున్న వ్యక్తితో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ఎవరైనా నన్ను ఇబ్బందులకు గురిచేస్తే కోర్టుకు వెళ్లడానికి కూడా వెనుకాడను” అంటూ చెప్పుకొచ్చింది. మరి వీరి వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.