Darshan Arrest: హత్య కేసు.. ప్రముఖ కన్నడ నటుడు అరెస్ట్!
- కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్
- పోలీసులు అదుపులో మరో పది మంది
- భార్యకు అసభ్యకరమైన సందేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sandalwood Actor Darshan Arrested in Murder Case: ఓ యువకుడి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీపను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం మైసూరులో దర్శన్‌తో పాటు మరో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో విచారణ నిమిత్తం వారిని బెంగళూరుకు తరలించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిత్రదుర్గలోని లక్ష్మీ వెంకటేశ్వర బరంగయ్‌లో నివాసం ఉంటున్న రేణుకా స్వామి జూన్ 1న ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. జూన్ 8న ఆ యువకుడు హత్యకు గురయ్యాడు. జూన్ 9వ కామాక్షిపాళ్యం సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్ పక్కన ఉన్న కాలువలో మృతదేహం కనిపించింది. కుక్కలు శవాన్ని పీక్కుతింటుండగా.. అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం అందించాడు. మృతుడు రేణుకా స్వామిగ పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
Also Read: Gold Rate Today: మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
ఈ కేసులో నటుడు దర్శన్‌పై ఆరోపణలు వచ్చాయి. విచారణలో భాగంగా ఇద్దరు నిందితులు దర్శన్ పేరు వెల్లడించారు. దాంతో మంగళవారం ఉదయం మైసూర్‌లోని ఒక ప్రైవేట్ హోటల్‌లో దర్శన్‌ను అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తీసుకువచ్చారు. చిత్రదుర్గ దర్శన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా రేణుకా స్వామి ఉన్నాడు. దర్శన్ భార్యకు రేణుకా స్వామి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!