Kaatera: ఒకప్పుడు కన్నడ సినిమాల గురించి కానీ, కన్నడ హీరోల గురించి కానీ టాలీవుడ్ లో చాలాతక్కువ మందికి తెలుసు. కానీ, ఎప్పుడైతే కెజిఎఫ్ వచ్చిందో.. పాన్ ఇండియా లెవల్లో సినిమా ప్రేక్షకులు అందరూ ఒక్కటిగా మారారు కథ బావుంటే.. ఎలాంటి సినిమా అయినా చూస్తామని నిరూపించారు. అలానే కెజిఎఫ్ తరువాత వచ్చిన కెజిఎఫ్ 2, కాంతార లాంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. వీటితో పాటు కన్నడ డబ్బింగ్ సినిమాలను కూడా అభిమానులు ఆదరిస్తున్నారు. అలా కన్నడ నటుడు దర్శన్.. తెలుగువారికి సుపరిచితుడిగా మారాడు. ఈ హీరో నటించిన కొన్ని సినిమాలు డబ్బింగ్ అయ్యి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. దర్శన్ గతేడాది కాటేరా మూవీతో ప్రేక్షకుల ముదుకు వచ్చాడు. సలార్ కు పోటీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సలార్ డిసెంబర్ 22 న రిలీజ్ అవ్వగా.. కాటేరా డిసెంబర్ 29 న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో దర్శన్ సలార్ గురించి కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేసిన సంగతి తెల్సిందే. తెలుగు సినిమాలకు భయపడాల్సిన అవసరం లేదని, మా ఏరియాలో మేమే గెలుస్తామని చెప్పుకొచ్చాడు. కథ నచ్చడంతో కాటేరా హిట్ టాక్ ను అందుకుంది. రూ. 100 కోట్లకు పైగా కలక్షన్స్ రాబట్టి సలార్ కు పోటీగా నిలిచింది. ఇక ఈ సినిమా ఓటిటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటిటీ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఫిబ్రవరి మొదటివారంలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగు రిలీజ్ మాత్రం ఇంకా అవ్వలేదు. మరి.. తెలుగు థియేటర్ రిలీజ్ చేస్తారా..? ఓటిటీలో తెలుగు వెర్షన్ పెడతారా.. ? అనేది తెలియాల్సి ఉంది.