మధుమేహం మరియు క్యాన్సర్ మాదిరిగానే అధిక కొలెస్ట్రాల్ సమస్య కూడా నిరంతరం పెరిగిపోతోంది. కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల శరీరం అనేక వ్యాధులకు గురవుతుంది. దీని వల్ల గుండెపోటు, గుండె ఆగిపోవడం, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు వస్తున్నాయి. కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుందో సాధారణంగా ప్రజలకు తెలియదు. చాలా మంది వ్యక్తులు లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష ద్వారా మాత్రమే దీనిని గుర్తిస్తారు.
ఓ యాప్ ద్వారా మాల్ వేర్ మన ఫోన్లలోకి ప్రవేశిస్తుంది. అది అందరికీ తెలిసిన యాపే. దాని పేరు ఐ రికార్డర్(iRecorder – Screen Recorder). ప్రముఖ ఆండ్రాయిడ్ స్క్రీన్ రికార్డింగ్ యాప్ ఇది. దీని ద్వారా మాల్ వేర్ ఫోన్లలోకి చొరబడినట్లు సైబర్ సెక్యూరిటీ ఫిర్మ్ ఈసెట్(ESET) ప్రకటించింది.
కూల్ డ్రింక్స్ ను అధికంగా తీసుకోవడం వల్ల అందులో ఉండే రసాయనాలు.. లివర్‌ను దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా మధుమేహంతో పాటు గుండె జబ్బులు కూడా వచ్చే ఛాన్స్ ఉందంటూన్నారు.
Nose Picking : కొంతమంది ఏ మాత్రం గ్యాప్ దొరికినా పదేపదే ముక్కులో వేలు పెట్టుకుంటూ ఉంటారు. ముక్కు దురద పెడుతుందనో.. ముక్కులో పక్కులు తీయడానికో అలా ముక్కులో వేలు పెట్టి తిప్పుతూ ఉంటారు. కానీ దీన్ని ఒప్పుకునేవాళ్ళు చాలా తక్కువ. కొందరు అనుకోకుండా దొరికిపోయి ఆ తరువాత షేమ్‌గా ఫీలవుతుంటారు.
Tsunami eruption from Sun: సూర్యుడు ప్రమాదకరంగా మారుతున్నాడు. ఒకవైపు బ్రిటన్‌లో సూర్యుడు మండిపోతుంటే.. మరోవైపు సూర్యుడి నుంచి విస్పోటనాలు జరుగుతున్నాయి. సాధారణంగా సూర్యుడు నిత్యం భగభగ మండుతుంటాడు. ఈ నేపథ్యంలో సూర్యుడి నుంచి విస్పోటనాలు జరగడం మాములు విషయమే. కానీ అతి భారీ విస్పోటనాలు జరిగితే మాత్రం ఆ ఎఫెక్ట్ ఇతర గ్రహాలపై పడుతుంది. అప్పుడు సూర్యుడి నుంచి ఊహించని స్థాయిలో శక్తి విడుదల అవుతుంది. దీనినే కరోనల్ మాస్ ఎజెక్షన్‌గా పిలుస్తారు. ప్రస్తుతం సూర్యుడిపై…
సాధారణంగా పచ్చగా, ఏపుగా పెరిగే మొక్కలను అందరూ ఇళ్లలో పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో చూసేందుకు అందంగా కనిపించే కోనో కార్పస్ అనే మొక్కను కూడా గతంలో చాలా మంది రోడ్డు డివైడర్ల మధ్యలో, నర్సరీల్లో, ఇళ్లల్లోనూ పెంచుతున్నారు. ఈ మొక్క నాటిన కొన్ని వారాల్లో ఏపుగా పెరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో ఈ మొక్కలు నాటవద్దని అధికారులు సూచిస్తున్నారు. రోడ్లపై, నర్సరీలలో, ఇళ్లల్లో ఎక్కడా ఈ మొక్కలను పెంచవద్దని నిషేధం విధించారు. ఈ మొక్కల కారణంగా…
చైనాలోని యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీగోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్. ఈ డ్యామ్ 2.33 కిలోమీటర్ల పొడవు. 181 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ మేరకు 660 కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్ ఏర్పడింది. రిజర్వాయర్‌లో సముద్ర మట్టంకన్నా సుమారు 175 మీటర్ల ఎత్తున నిలిచిన నీటి బరువు ఏకంగా 39 వేల కోట్ల కిలోలు ఉంటుంది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే ఈ డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు…
ప్రస్తుతం ఇంటర్నెట్ వాడాలంటే బ్రౌజర్‌గా గూగుల్ క్రోమ్‌ను ఎక్కువగా వాడుతున్నారు. ప్రపంచంలో 63 శాతం మంది గూగుల్ క్రోమ్ వాడుతున్నట్లు ఇటీవల ఓ సర్వేలో స్పష్టమైంది. అయితే గూగుల్ క్రోమ్ వాడుతున్న యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ క్రోమ్ ప్రమాదకరమని వార్నింగ్ ఇచ్చింది. దీంతో సైబర్ భద్రతకు ముప్పు ఎక్కువగా ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్ ఇన్) హెచ్చరించింది. దీనికి సంబంధించి ఓ నివేదికను కేంద్ర ప్రభుత్వ సంస్థ…
కరోనా కేసులు బీభత్సంగా పెరుగుతున్న వేళ ఇటీవల దేశంలో కరోనా టాబ్లెట్ మోల్నుపిరవిర్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ టాబ్లెట్‌తో ముప్పు పొంచి ఉందని భారత వైద్యపరిశోధన మండలి(ఐసీఎంఆర్) చీఫ్ బలరాం భార్గవ హెచ్చరికలు జారీ చేశారు. ఈ కరోనా మాత్ర వాడితే శరీరంలో ఎముకలు, కండరాలు దెబ్బతినే అవకాశముందని ఆయన తెలిపారు. మోల్నుపిరవిర్ 200 ఎంజీ టాబ్లెట్‌తో జన్యువుల్లో శాశ్వతంగా మార్పులు వస్తామని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఈ టాబ్లెట్ మాత్రలను కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ..…
అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం కలిగిస్తున్నాయి. హిందూపురం కొట్నూరు చెరువు మరువ వద్ద తృటిలో తప్పింది పెను ప్రమాదం.నీటిలో చిక్కుకుపోయింది తూముకుంట గార్మెంట్స్ కు వెళ్లే ప్రైవేటు బస్సు. నీటి ప్రవాహం భారీగా ఉన్నా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు డ్రైవర్. బస్సులో దాదాపు 30 మంది మహిళలు వున్నారు. స్థానికుల సహాయంతో బయటపడ్డారు కార్మికులు. భారీ నీటి ప్రవాహం వున్నప్పుడు బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా వుండాలని స్థానికులు సూచిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడడంతో మహిళా…