ఇజ్రాయెల్‌లో నెతన్యాహు ప్రభుత్వానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వివాదాస్పద బిల్లును ప్రధాన మిత్రపక్షం తీవ్రంగా వ్యతిరేకించింది.
మిచెల్ స్టార్క్‌ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో అతను మెగా వేలంలో ఉండనున్నాడు. అయితే.. ఈసారి స్టార్క్ రికార్డు వేలం కొల్లగొట్టకపోవచ్చునని.. ఇంతకుముందు మెగా వేలంలో స్టార్క్ రికార్డును బద్దలు కొట్టగల ఓ భారతీయ ఆటగాడు ఉన్నట్లు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు.
ఐసీసీ (ICC) మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌లో టీమిండియా రేపు (అక్టోబర్ 4న) న్యూజిలాండ్‌తో మొదటి మ్యాచ్ ఆడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరుగనుంది.
దేశంలో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతోంది. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ ప్రమాదాల బారిన చాలా మంది పడుతున్నారు. ఇవన్నీ అకాల మరణాల ప్రమాదానికి దారితీస్తాయి. యువత కూడా ఈ సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి. ఈ సమస్యలను సకాలంలో పరిష్కరించి చికిత్స తీసుకుంటే ప్రమాదాల బారి నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు అనేక రకాల తీవ్రమైన కడుపు సంబంధిత సమస్యలకు గురవుతున్నారు. హెర్నియా కూడా ఆ సమస్యలలో ఒకటి. దీని ప్రమాదం కూడా క్రమక్రమేణా పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇంగువినల్ హెర్నియా అనేది ఒక రకమైన హెర్నియా. దీనివల్ల దిగువ ఉదర కండరాలలో బలహీనత సమస్య ఏర్పడుతుంది. దీనికి శస్త్రచికిత్స అవసరం. అయితే.. హెర్నియా సమస్య ఎవరికైనా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మన దేశపు ఉప్పు, చక్కెరలో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నట్లు వార్తలు జనాలను టెన్షన్ పెడుతున్నాయి. అయితే.. ఓ స్టడీ ఫలితాల్లో నిజమే అని తేలింది. ఉప్పు, పంచదార కాకుండా.. మన శరీరంలోకి అనేక విధాలుగా మైక్రోప్లాస్టిక్‌లు వెళ్తున్నాయి. దాంతో.. అనేక ప్రధాన వ్యాధులకు గురవుతారు. మనం రోజు తాగే 'టీ' తాగడం వల్ల శరీరంలోకి ప్లాస్టిక్ వెళ్తుంది.
దేశ రాజధాని ఢిల్లీ కరోల్‌బాగ్‌లోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనపై వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో 8 ఫైరింజన్లు అక్కడికి చేరుకుని.. రెస్క్యూ పనులు ప్రారంభించారు. అయితే.. అదృష్టవశాత్తూ మంటలు చెలరేగిన వెంటనే ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు భవనం నుంచి వెళ్లిపోయారు. దీంతో ప్రాణపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్న క్రమంలో…
ఆహారాన్ని ఎక్కువసేపు వేడిగా ఉంచడానికి అల్యూమినియం ఫాయిల్‌ను ప్యాకింగ్ చేయడానికి రెస్టారెంట్లతో పాటు.. ఇళ్లలో కూడా ఉపయోగిస్తున్నారు. అల్యూమినియం కవర్స్‌లో చుట్టబడిన రోటీస్ కానీ.. ఇతర వస్తువులు చాలా సమయం పాటు వేడిగా, తాజాగా ఉంటాయి. అయితే అల్యూమినియం కవర్స్ వాడకం మన ఆరోగ్యానికి మంచిదేనా..? ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి ముంపు పొంచి ఉందా.. యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత కూడా రామప్ప అభివృద్ధికి సరైన చర్యలు తీసుకోవడం లేదా అంటే అవుననే అంటున్నారు స్థానికులు. చిన్నపాటి వర్షానికి రామప్ప దేవాలయం పైకప్పు నుంచి నీరు కురవడమే ఎందుకు నిదర్శనం అంటున్నారు.
పావురాలను ఎక్కువగా ఇళ్లల్లో పెంచుకుంటారు. అంతేకాకుండా.. ఇంటిపై స్థావరాలను ఏర్పరుచుకుని విశ్రాంతి తీసుకుంటాయి. కొన్ని చోట్ల రోడ్లపై వీపరీతంగా వాలుతూ ఉంటాయి. అయితే.. పావురం ఈకలు, రెట్టలతో ప్రమాదమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఒక అధ్యయనం ద్వారా వెలుగులోకి వచ్చింది. పావురం ఈకలు, రెట్టలతో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా చిన్నారులు, యువత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.