ప్రస్తుతం ఇంటర్నెట్ వాడాలంటే బ్రౌజర్‌గా గూగుల్ క్రోమ్‌ను ఎక్కువగా వాడుతున్నారు. ప్రపంచంలో 63 శాతం మంది గూగుల్ క్రోమ్ వాడుతున్నట్లు ఇటీవల ఓ సర్వేలో స్పష్టమైంది. అయితే గూగుల్ క్రోమ్ వాడుతున్న యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ క్రోమ్ ప్రమాదకరమని వార్నింగ్ ఇచ్చింది. దీంతో సైబర్ భద్రతకు ముప్పు ఎక్కువగా ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్ ఇన్) హెచ్చరించింది. దీనికి సంబంధించి ఓ నివేదికను కేంద్ర ప్రభుత్వ సంస్థ విడుదల చేసింది. ఇటీవల కాలంలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌పై ఎక్కువగా సైబర్ అటాక్స్ జరుగుతున్నాయని నివేదిక వెల్లడించింది.
Read Also: ప్రధాని మోదీ హ్యాట్రిక్.. వరుసగా మూడో ఏడాది నంబర్‌వన్
అయితే గూగుల్ క్రోమ్‌లో ‘98.0.4758.80’ వెర్షన్ వాడే యూజర్లకే ముప్పు ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ హెచ్చరించింది. ఇప్పుడు ‘98.0.4758.80/81/82’గా గూగుల్ అప్ డేట్ చేసిందని.. సదరు వెర్షన్‌తో ముప్పు లేదని తెలిపింది. క్రోమ్‌లో 27 సేఫ్టీ ఫీచర్లను గూగుల్ అప్‌డేట్ చేసిందని గుర్తుచేసింది. కాబట్టి క్రోమ్ పాత వెర్షన్‌లు వాడరాదని.. అందరూ కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ కావాలని సూచించింది. సేఫ్ బ్రౌజింగ్ ఫ్రీ, వెబ్ సెర్చ్, థంబ్ నెయిల్ ట్యాబ్ స్ట్రిప్, స్క్రీన్ క్యాప్చర్, విండో డైలాగ్, పేమెంట్స్, ఎక్స్ టెన్షన్స్, యాక్సెస్‌బులిటీ అండ్ కాస్ట్, యాంగిల్ హీప్ బఫర్ ఓవర్ ఫ్లో, ఫుల్ స్క్రీన్, స్క్రోల్, ఎక్స్ టెన్షన్స్ ప్లాట్ ఫాం, పాయింటర్ లాక్‌లను సరిగ్గా వాడకపోవడం, వీ8 టైపింగ్ లో గందరగోళం, కూప్‌లో బైపాస్ విధానాలు వంటి కారణాలతో గూగుల్ క్రోమ్‌లో సైబర్ దాడుల ముప్పు ఎక్కువగా ఉందని నివేదిక హెచ్చరించింది.