కరోనా వైరస్ వ్యాక్సిన్ యొక్క దుష్ప్రభావాలకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న వేళా.. ఇప్పుడు మరో కొత్త టెన్షన్ నెలకొంది. వ్యాక్సిన్ వల్ల కలిగే దుష్పరిణామాలకు భయపడేలా చేసి అమాయకుల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
భారతీయ వంటకాల్లో ఉల్లిపాయ ఎంతో ముఖ్యమైనది. ప్రతి వంటకాల్లోనూ ఉల్లిపాయను వేస్తుంటారు. ఉల్లిపాయను సుగంధ ద్రవ్యాల కోసం, ఆహార రుచిని పెంచడానికి కూరల్లో వాడుతుంటారు. అయితే తరుచుగా తరిగిన ఉల్లిపాయలను ఫ్రిజ్ లో ఉంచుతారు. అలా కట్ చేసిన ఉల్లిపాయలను ఫ్రిజ్ లో ఉంచితే మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
విషపూరితమైన గాలి, ఆహారపు అలవాట్ల కారణంగా చర్మ సమస్యలు వస్తాయి. వాతావరణ కాలుష్యం కారణంగా.. శ్వాసకోశ వ్యాధులతో పాటు చర్మ వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులో దురద కలిగించే చర్మ వ్యాధి ఇబ్బందికరంగా మారుతుంది. అయితే శరీరంలో దురద, అలర్జీ లాంటివి అనిపిస్తే వెంటనే డాక్టర్ల వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి.
ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ లవర్స్ కు పండగే. ఎందుకంటే ఈ జట్లు తలపడుతున్నప్పుడు చూడటమంటే ఆ కిక్కే వేరని అంటున్నారు. ఇప్పటికే రేపు జరగబోయే మ్యాచ్ కోసం అభిమానులు అహ్మదాబాద్ కు చేరుకున్నారు. డబ్బులు ఎంత ఖర్చైనా పర్వాలేదు.. కానీ స్టేడియంలో లైవ్ చూడాల్సిందేనంటూ ఎక్కడెక్కడి నుంచో అక్కడికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇరు జట్లు ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలిచి మంచి ఊపు మీదున్నాయి. ఎలాగైనా ప్రత్యర్థి టీంను ఓడించాలనే కసితో ఇరు…
హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్ గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేంద్రంలో ప్రతిపక్ష పార్టీగా కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
కేరళలోని కోజికోడ్ జిల్లాలో శుక్రవారం నిపా వైరస్ సోకిన మరో కేసు నిర్ధారించారు. ఓ 39ఏళ్ల వ్యక్తికి నిపా వైరస్ సోకినట్లు నిర్ధారించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కార్యాలయం శుక్రవారం తెలిపింది.
దేశంలో ప్రమాదకర ఘడియలు దగ్గర పడుతున్నాయి.. రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్- వన్ ఎలక్షన్ కోసం ఓ కమిటీని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
టొమాటోతో కొంతమందికి హాని కలిగిస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను ఎదుర్కొంటున్న వ్యక్తులకు టమోటాలు హాని కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటి వారికి టొమాటో తినడం వలన కడుపు మంట వస్తుంది. అంతే కాకుండా.. టొమాటోలు తిన్న తర్వాత గుండెల్లో మంట, అజీర్ణం లేదా జీర్ణశయాంతర సమస్యలు ఉన్నవారు టమోటాలు తినకుండా ఉండటం మంచిది.
మీకు చలి జ్వరం వచ్చినట్లైతే ఈజీగా తీసుకోకండి. ఇది UTI సంక్రమణ యొక్క లక్షణానికి దారితీస్తుంది. వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాలి. యూరిన్ ఇన్ఫెక్షన్‌కు సకాలంలో చికిత్స చేయకపోతే, ఆ ప్రభావం కిడ్నీలపై పడుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా యూరిన్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ వ్యాధి మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పురుషులు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రమాదకరమైన బ్యాక్టీరియా మూత్ర నాళంలోకి చేరినప్పుడు, అది UTIకి దారి తీస్తుంది అని…