Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ రూపకల్పనపై ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్సైజ్ పాలసీ గడువు సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనుండటంతో, తదుపరి తీసుకోబోయే నిర్ణయాలపై అధికారుల మధ్య చర్చలు సాగుతున్నాయి. 2024 అక్టోబర్ 12న అమల్లోకి వచ్చిన రెండేళ్ల పాలసీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో.. పూర్తిగా కొత్త పాలసీని తీసుకురావాలా లేదా ప్రస్తుతం ఉన్న లైసెన్సులనే రెన్యువల్ చేయాలా అనే అంశంపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది.
గతంలో దరఖాస్తు ఫీజుల రూపంలో ప్రభుత్వానికి దాదాపు రూ.1,900 కోట్ల మేర భారీ ఆదాయం రాగా, వ్యాపారుల నుంచి 90 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే.. ప్రస్తుతం ఉన్న మార్జిన్లు తమకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేవని లైసెన్సుదారులు చెబుతున్నారు. కొనుగోళ్లపై కనీసం 20 శాతం మార్జిన్ ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read
మరోవైపు.. ప్రస్తుత లైసెన్సులనే రెన్యువల్ చేసే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం, భారీ మొత్తంలో లైసెన్స్ ఫీజు నిర్ణయించే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా నగరాల్లో రూ.40 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 లక్షల వరకు లైసెన్స్ ధరలను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ ఫీజును వ్యాపారులకు వెసులుబాటుగా 50 శాతం చొప్పున రెండు విడతల్లో చెల్లించే అవకాశం కల్పించనున్నారు.
త్వరలోనే మద్యం వ్యాపారులతో నేరుగా చర్చలు జరిపి వారి అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు, ఈ విధానం ద్వారా ప్రభుత్వ ఖజానాకు అదనంగా ఎంత ఆదాయం సమకూరుతుందనే అంచనాలను సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రద్దయిన బార్ల సుదీర్ఘకాల లైసెన్సులను తిరిగి పునరుద్ధరించే అంశంపైనా కసరత్తు కొనసాగుతోంది. వీటన్నింటిపై అధ్యయనం ముగిసిన తర్వాత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీ నూతన మద్యం పాలసీపై తుది నిర్ణయం తీసుకోనుంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు