Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల విదేశీ పర్యటనకు సంబంధించి ఒక ఫోటో వైరల్ అయింది. ఆయన పక్కనే ఒక బాబు, మహిళ కూర్చున్న ఫోటోలు, వీరంతా ఒక పడవలో ప్రయాణిస్తు్న్న ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. అయితే, ఈ ఫోటోను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎక్స్‌లో షేర్ చేయడం కొత్త వివాదానికి దారి తీసింది. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. ‘‘ఈ ఫోటో ఎక్కడ తీశారు? ఎప్పుడు తీశారు..? మీతో ఉన్న వ్యక్తులు ఎవరు..? ’’ అని ప్రశ్నించారు.
“రాహుల్ జీ, ఈ ఫొటో ఎక్కడ తీశారు? ఎప్పుడు తీశారు? ఈ ఫొటోలో మీతో ఉన్న వ్యక్తులు ఎవరు? తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది” అంటూ గిరిరాజ్ సింగ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన గురించి బీజేపీ గత కొంత కాలంగా ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. ప్రతిపక్ష నేత ఆచూకీ లేకుండా కొన్ని రోజుల పాటు విదేశాలకు వెళ్తుండటాన్ని ప్రశ్నిస్తోంది.
Also Read
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
- Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
- BJP: రాహుల్ గాంధీకి అవగాహన లేదు..‘‘ఓట్ చోరీ’’పై బీజేపీ స్ట్రాంట్ కౌంటర్..
- Election Commission: విభేదాలకు కారణమైన ఫారం 6పై ఈసీఐ ఫుల్ క్లారిటీ..
ఈ ఫోటోపై కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. రాహుల్ గాంధీతో ఫొటోలో ఉన్న మహిళ, చిన్నారి ఆయన స్నేహితుడి భార్య, కుమారుడని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన సమయంలో ఈ ఫొటో తీసినట్లు తెలిపింది. అయితే రాహుల్ స్నేహితుడు ఫొటోలో లేరని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సప్రియా శ్రీనేత్ గిరిరాజ్ సింగ్‌పై తీవ్రంగా స్పందించింది. మహిళ, పరుషుడుతో కలిసి ఉన్న ఫోటోను చూసి అసభ్య ఆలోచనలు చేయడం సరికాదని విమర్శించారు. ఈ ఫోటో టెక్సాస్‌లోని లేక్ రే రాబర్ట్స్లో తీసిందని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ అవి దండియా వెల్లడించారు.
గత కొంత కాలంగా రాహుల్ విదేశీ పర్యటనలు వివాదాస్పదమవుతున్నాయి. జూన్ 22 నుంచి జూలై 13 వరకు రాహుల్ గాంధీ విదేవీ పర్యటనపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన ఎక్కడికి వెళ్లారు.? ఎవరిని కలిశారు? ఆ ప్రమాణ ఖర్చులు, వసతి ఎవరు భరించారు? అని ప్రశ్నించారు. బీజేపీ ముంబై అధ్యక్షుడు అమీత్ సతామ్, రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో భారత్‌కు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల్ని కలిశారని ఆరోపించారు.
తాజావార్తలు
-
SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
-
Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
-
OTR : టీడీపీ–జనసేన మధ్య ఫ్రెండ్లీ ఫైట్? కూటమి ఓట్లు చీలితే నష్టం ఎవరికీ?
-
Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
-
Story Board : డీలిమిటేషన్‌పై కేంద్రం వ్యూహమేంటి..? సర్కారు ఎలాంటి ఫార్ములా తీసుకొస్తుంది..?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!