కూల్ డ్రింక్స్ తాగుతున్నారా జాగ్రత్త. శీతల పానీయాలతో ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఎండకాలం పూటైతే ఎండ వేడిమికి తట్టుకోలేకనో చల్లగా కడపులో ఏసేస్తారు. అంతేకాకుండా ఏదైనా పనిచేసి అలిసిపోయినా.. సరదాగా స్నేహితులతో టైమ్ పాస్ కోసం, తిన్నది అరిగించుకోవడం కోసం.. ఇలా రకరకాల కారణాలతో కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. ఏదేమైనాప్పటికీ కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరమేనని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో వీటిని తాగే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అందులోనూ.. వేసవి వస్తే.. ఇంకా ఎక్కువగా ఈ శీతల పానీయాలు సేవిస్తున్నారు. కానీ.. కూల్ డ్రింక్స్ ను అదే పనిగా తాగడం వల్ల లేనిపోని రోగాల్ని కొని తెచ్చుకున్నట్లే అని వైద్యులు చెబుతున్నారు.
Read Also: Minister Ktr: కేంద్ర మంత్రిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్
కూల్ డ్రింక్స్ ను అధికంగా తీసుకోవడం వల్ల అందులో ఉండే రసాయనాలు.. లివర్ను దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా మధుమేహంతో పాటు గుండె జబ్బులు కూడా వచ్చే ఛాన్స్ ఉందంటూన్నారు. సాఫ్ట్ డ్రింక్ నుంచి డైట్ సోడా వరకు ఇలా ఏ శీతల పానీయాన్ని తీసుకున్నా.. వాటి తయారీలో వాడే చక్కెరతో పాటు ఇతర రసాయనాలు మన ఆరోగ్యానికి చేటు చేస్తాయని చెబుతున్నారు. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగే వారిలో విపరీతంగా క్యాలరీలు పెరిగిపోయి.. బరువు పెరిగే అవకాశం ఉంది. ఆహారం తక్కువ తీసుకుని వీటిని త్రాగే వారికి స్థూలకాయం తప్పని సరిగా వస్తుంది. శీతల పానియాల్లో అధికంగా షుగర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి శీతల పానీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది’ అని నిపుణులు చెబుతున్నారు.
Read Also: AV Subbareddy: భుజాల మీద ఎత్తుకొని పెంచితే.. చున్నీ లాగానంటోంది
సాధారణంగా 250 -300 మిల్లీ లీటర్ల కూల్ డ్రింక్లో 150-200 క్యాలరీలు ఉంటాయి. కూల్ డ్రింక్స్ లో అధిక ఫ్రక్టోజ్ ఉంటుంది. దీని వల్ల డయాబెటిస్, బీపీ, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. రోజూ కూల్ డ్రింక్స్ తాగే వారిలో ఫాస్పరిక్ యాసిడ్ వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడే కాంపనెంట్ హైడ్రాలిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. ఇది మన కడుపులోనే ఉత్పత్తి అవుతుంది. కూలా డ్రింక్స్ తాగినప్పుడు అందులో ఉండే రసాయనం ఈ యాసిడ్ తో కలిసినప్పుడు జీవక్రియల మీద విపరీతమైన ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఎముకల బలహీనత, దంత సమస్యలు, బ్రెయిన్ కు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలున్నట్లు వైద్యులు తెలుపుతున్నారు.