Tsunami eruption from Sun: సూర్యుడు ప్రమాదకరంగా మారుతున్నాడు. ఒకవైపు బ్రిటన్‌లో సూర్యుడు మండిపోతుంటే.. మరోవైపు సూర్యుడి నుంచి విస్పోటనాలు జరుగుతున్నాయి. సాధారణంగా సూర్యుడు నిత్యం భగభగ మండుతుంటాడు. ఈ నేపథ్యంలో సూర్యుడి నుంచి విస్పోటనాలు జరగడం మాములు విషయమే. కానీ అతి భారీ విస్పోటనాలు జరిగితే మాత్రం ఆ ఎఫెక్ట్ ఇతర గ్రహాలపై పడుతుంది. అప్పుడు సూర్యుడి నుంచి ఊహించని స్థాయిలో శక్తి విడుదల అవుతుంది. దీనినే కరోనల్ మాస్ ఎజెక్షన్‌గా పిలుస్తారు. ప్రస్తుతం సూర్యుడిపై అతి భారీ విస్పోటనం జరిగిందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావంతో సౌరశక్తి సునామీలా వెలువడుతోందని వివరించారు. ఈ సునామీ ఈనెల 23న భూ వాతావరణాన్ని తాకనుందని పరిశోధకులు వివరించారు.
Read Also:India-Pakistan: ఇండియా-పాక్ ప్రధానుల మధ్య సమావేశం.. ఆరేళ్ల తరువాత మొదటిసారి
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కోల్‌కతా సంస్థ నేతృత్వంలో ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్స్ ఇండియా సూర్యుడికి సంబంధించి ప్రధానమైన మార్పులను గుర్తించింది. ఈ మేరకు సూర్యుడి నుంచి వెలువడే సునామీ తరంగాలు భూ అయస్కాంత క్షేత్రాన్ని అపరిమిత వేగంతో ఢీకొడతాయని ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్స్ ఇండియా సైంటిస్టులు హెచ్చరించారు. సూర్యుడి మధ్యభాగంలో అతి పెద్ద రంధ్రం ఏర్పడిందని కూడా వెల్లడించారు. ఈ రంధ్రం నుంచి అపరిమిత వేగంతో సౌర తుఫాన్ గాలులు వెలువడుతున్నాయని తెలిపారు. ఈ తరంగాలు భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకనున్నాయని సైంటిస్టులు విశ్లేషించారు. శాస్త్రవేత్తల హెచ్చరికలతో పలు ఆఫ్రికా దేశాలు హడలెత్తిపోతున్నాయి.