Bhumana Karunakar Reddy React on Tirumala Annaprasadam Complaints: తిరుమల అన్నప్రసాద సముదాయంలో ఇప్పటివరకు ఎలాంటి పిర్యాదులు రాలేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ‘మాకు ఇప్పటివరకు ఎలాంటి పిర్యాదులు అందలేదు. నిన్న కొంతమంది భక్తులు అన్నప్రసాదంలో నాణ్యత లేదంటూ ఆందోళన చెయ్యడం మా దృష్టికి వచ్చింది. నిజంగా నాణ్యత లేదంటే వాటిని సరిదిద్దుకోవడానికి మేము సిద్దంగా ఉన్నాం. ఇతర భక్తులను కూడా వారు రెచ్చగోట్టేలా వ్యవహరించడం సముచితం కాదు. ఉద్దేశపూర్వకంగా టీటీడీ…
Thousands of acres of crops damaged due to Cyclone Michuang: బంగాళఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుపతి జిల్లా చిట్టేడులో అత్యధికంగా 39 సెంమీ వర్షపాతం నమోదవగా.. నెల్లూరు జిల్లా మనుబోలులో 36.8 సెంమీ నమోదైంది. అల్లంపాడులో 35 సెంమీ, చిల్లకూరులో 33 సెంమీ, నాయుడుపేటలో…
Huge Floods at Atmakur Bus Stand: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్.. నెల్లూరు వద్ద కేంద్రీకృతమై తదుపరి తూర్పు దిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల జోరుకు నెల్లూరు నగరంలోని కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. నెల్లూరు తూర్పు, పడమర భాగాలను కలిపే ఆత్మకూరు బస్టాండ్ వద్ద భారీగా వరద నీరు చేరింది. రామలింగాపురం, మాగుంట లేఔట్ అండర్ బ్రిడ్జిలలోకి భారీగా వరద నీరు చేరింది.…
Heavy Rains in AP Due to Michaung Cyclone: మిచాంగ్ తుపాను తరుముకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు 20 కిమీ, బాపట్లకు 110 కిమీ దూరంలో ఇది కేంద్రీకృతమైంది. తుపాను కారణంగా కోస్తాంధ్ర, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తీరానికి అత్యంత దగ్గరగా తుపాను కదులుతోందని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. గడిచిన 6 గంటలుగా గంటకు 7…
Many flights canceled due to Cyclone Michaung in AP: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మిచాంగ్’ తుపాను సోమవారం తీవ్ర రూపం దాల్చింది. గంటకు పది కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తాంధ్రకు సమాంతరంగా కదులుతుండడంతో.. తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. విపరీతమైన ఈదురుగాలులతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏపీ తడిసి ముద్దయింది. పలు ప్రాంతాలు జలదిగ్బంధం అయ్యాయి. భారీ వర్షాలకు…
Cyclone Michaung: మిచాంగ్ తుఫాను సోమవారం (డిసెంబర్ 4) తీవ్ర తుఫానుగా మారింది. ఇది నెల్లూరుకు ఆగ్నేయంగా 80 కి.మీ, చెన్నైకి ఉత్తర-ఈశాన్య దిశలో 120 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
మీచౌంగ్ తుఫాన్ దెబ్బకి గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి విమానాలు రద్దు చేశారు.. ఇండిగో నుంచి నడిచే 14 విమానాలు రద్దు చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.. విశాఖ, హైదరాబాద్, బెంగులూరు, షిర్డీలకు కనెక్టింగ్ ఫ్లైట్స్ రద్దు చేసినట్టు పేర్కొంది ఇండిగో.. మరో 4 విమానాల రాకపోకలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి... మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోస్తా తీరం వెంబడి అధికారులు తగిన చర్యలు చేపట్టారు .. తుఫాను తీవ్రతరం అవుతుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం