Bhumana Karunakar Reddy React on Tirumala Annaprasadam Complaints: తిరుమల అన్నప్రసాద సముదాయంలో ఇప్పటివరకు ఎలాంటి పిర్యాదులు రాలేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ‘మాకు ఇప్పటివరకు ఎలాంటి పిర్యాదులు అందలేదు. నిన్న కొంతమంది భక్తులు అన్నప్రసాదంలో నాణ్యత లేదంటూ ఆందోళన చెయ్యడం మా దృష్టికి వచ్చింది. నిజంగా నాణ్యత లేదంటే వాటిని సరిదిద్దుకోవడానికి మేము సిద్దంగా ఉన్నాం. ఇతర భక్తులను కూడా వారు రెచ్చగోట్టేలా వ్యవహరించడం సముచితం కాదు. ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్టని దెబ్బతీసేలా వ్యవహరిస్తే మాత్రం చర్యలు తీసుకుంటాం’ అని కరుణాకర్ రెడ్డి అన్నారు.
Also Read: Chandrababu Naidu: చంద్రబాబుపై సీఐడీ పీటీ వారెంట్లు.. తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు!
బంగాళఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తిరుమల పాపవినాశనం డ్యాం, గోగర్బం డ్యాంలను టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. ’15 రోజులు క్రితం తిరుమల, తిరుపతికి త్రాగునీటి ఇబ్బందులు తల్లేత్తకూండా చర్యలు తీసుకోవాలని సమావేశం ఏర్పాటు చేసాం. మూడు రోజుల వ్యవధిలో 25 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో తిరుమలలో అన్నీ డ్యాంలు నిండిపోయాయి. ఏడాదిన్నర పాటు ఎలాంటి ఇబ్బందులు లేకూండా త్రాగునీటి నిల్వలు ఉన్నాయి’ అని టీటీడీ చైర్మన్ చెప్పారు.