Weather Report: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26 సాయంత్రం నాటికి ఇది మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
Minister Karumuri Venkata Nageswara Rao Visits Cyclone affected areas: ‘మిచౌంగ్’ తుపాన్ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. అన్ని విధాలుగా ఆదుకుంటాం అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. సీఎం ప్రతి అంశంపై మానిటరింగ్ చేస్తున్నారని, నష్టపోయిన రైతులు అన్ని విధాల ఆదుకోవాలని అధికారులకు సూచనలు చేశారని తెలిపారు. నేడు విజయవాడ – మచిలీపట్నం హైవే రోడ్డు పరిసర ప్రాంతాలను మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరిలించారు. ఈ…
AP CM YS Jagan React on Cyclone Michaung Effect: ఏపీలోని తుపాను ప్రభావిత పరిస్థితులపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులంతా తమ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. బాధితుల స్థానంలో తాము ఉంటే ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో ఆ తరహా సహాయం అందించాలని, రూ. 10లు ఎక్కువైనా…
181.5 mm rainfall in AP: ఏపీలో ‘మిచాంగ్’ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో గత 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో ఏపీ తడిసి ముద్దయింది. తుఫాన్ దాటికి వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాలు జలమయం అవ్వగా.. రోడ్డుపైకి భారీగా వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో చేతికి…
Heavy Rains in AP Due to Cyclone Michaung: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుపాన్ వాయుగుండంగా బలహీనపడింది. ఈ వాయుగుండం ఈరోజు మధ్యాహ్నానికి అల్పపీడనంగా బలహీనపడే అవకాశముంది. మిచాంగ్ ప్రభావంతో ఏపీలో ప్రస్తుతం వర్షాలు ఉరుస్తున్నాయి. మరో 24 గంటల పాటు కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు వద్ద వైరా,…
Heavy Crop damage in AP: మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఏడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కాలనీలు జలమయంగా మారాయి. గోరింకల డ్రైన్ పొంగి పొర్లుతోంది. వర్షాలకు వరి చేలు మొత్తం నేలకొరిగాయి. చేతికి అందివచ్చిన పంటలు దెబ్బ తినడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లితో పాటు అనేక మండలాలలో వరి చేలు దెబ్బతిన్నాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు అంటున్నారు. మిచాంగ్ తుఫాన్…
Many trains canceled on Wednesday in AP: ‘మిచాంగ్’ తుపాను ఏపీలోని పలు జిల్లాలను కుదిపేసింది. తుపాను ప్రభావంతో కురుస్తున్న కుండపోత వర్షాలకు జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు, 80-110 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులతో ఏపీలోని పట్టణాలు, పల్లెలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన రోడ్లపై మోకాళ్ల లోతుకు పైగా నీళ్లు ఉండడంతో…
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ మిచౌంగ్ తీరం దాటింది. ఏపీలోని బాపట్ల సమీపంలో తుఫాన్ తీరం దాటిన సమయంలో బీభత్స వాతావరణం కనిపించింది. తీర ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం హోరెత్తింది. సముద్రంలో అలలు... ఐదు నుండి ఆరు అడుగుల మేర ఎగిసిపడ్డాయి. అల్లవరం సమీపంలో సముద్రం అలకల్లోలంగా మారింది.
Cyclone Michuang Enters Bapatla: బంగాళఖాతంలో ఏర్పడిన ‘మిచౌంగ్’ తుపాను బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. ఈ విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో గంటలో మిచౌంగ్ తుపాను పూర్తిగా తీరాన్ని దాటనుందని పేర్కొన్నారు. తుపాను బాపట్ల తీరం దాటిన తర్వాత.. సాయంత్రానికి బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశముందని అంచనా వేశారు. మిచౌంగ్ తుపాను తీరం దాటుతున్న సమయంలో బాపట్ల తీర ప్రాంతంలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. అటు సముద్రంలో అలలు…