ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) వరుస పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఐదుసార్లు ఛాంపియన్ అయిన సీఎస్‌కే.. ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తోంది. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. సీఎస్‌కే ప్లేఆఫ్స్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి. మిగిలిన 5 మ్యాచ్‌లలో గెలిచినా.. 14 పాయింట్స్ మాత్రమే ఖాతాలో చేరుతాయి. ప్రస్తుత సమీకరణాల ప్రకారం సీఎస్‌కే ప్లేఆఫ్స్ చేరడం అసాధ్యం. సీఎస్‌కే పరాజయ పరంపర నేపథ్యంలో…
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. రుతురాజ్ స్థానంలో సీఎస్‌కే ఓ సీనియర్ బ్యాటర్‌ని తీసుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా.. 17 ఏళ్ల కుర్రాడికి అవకాశం ఇచ్చింది. అతడే ముంబైకి చెందిన యువ బ్యాటింగ్ సంచలనం ఆయుష్ మాత్రే. ఈ విషయాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అధికారికంగా ప్రకటించింది. Also Read: LSG vs CSK: మెరిసిన…
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. అయిదు ఓటముల తర్వాత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ)తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఎంఎస్ ధోనీ (26 నాటౌట్; 11 బంతుల్లో 4×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. శివమ్ దూబే (43 నాటౌట్; 37 బంతుల్లో 3×4, 2×6) రాణించాడు. అంతకు ముందు చెన్నై బౌలర్ నూర్…
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) దారుణ ప్రదర్శన చేస్తోంది. ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించిన సీఎస్‌కే.. ఆపై వరుసగా ఐదు ఓటములు చవిచూసింది. హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో అయితే హ్యాట్రిక్ ఓటమిని ఎదుర్కొంది. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయాంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వం వహించినా.. సీఎస్‌కే రాత మారలేదు. అంతేకాదు బంతుల పరంగా ఐపీఎల్‌లో అత్యంత ఘోరమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. వరుసగా ఐదు ఓటములతో చెన్నై ఫాన్స్…
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. గాయం కారణంగా రుతురాజ్ 18వ సీజన్ నుంచి వైదొలిగడంతో.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మళ్లీ సీఎస్‌కే సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ధోనీ కెప్టెన్సీలో సీఎస్‌కే విజయాలు సాదిస్తుందని అటు మేనేజ్‌మెంట్, ఇటు ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చివరిసారి ధోనీ సీఎస్‌కే కెప్టెన్‌గా ఉన్నప్పుడు గుజరాత్ టైటాన్స్ జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై విజయం సాధించింది. మహీ…
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. రుతురాజ్ టోర్నీ నుంచి వైదొలిగడంతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మళ్లీ సారథ్యం స్వీకరించాడు. ధోనీ కెప్టెన్సీపై రుతురాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించాడు. సీఎస్‌కేకు ఓ యంగ్ వికెట్ కీపర్ ఉన్నాడని, అతడు జట్టును ముందుకు తీసుకెళ్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. తప్పకుండా సీఎస్‌కే మళ్లీ విజయాలబాట పడుతుందని, డగౌట్ నుంచి తన…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో 150వ క్యాచ్‌ను అందుకున్న మొదటి వికెట్ కీపర్‌గా ధోనీ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో నేహల్ వధేరా క్యాచ్‌ను అందుకోవడంతో మహీ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఈ రికార్డుకు చేరువలో మరెవరూ కూడా లేరు.…
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కి ఎంఎస్ ధోని మరింత సహకారం అందించగలడని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ధోని జట్టుకు తక్కువ ఉపయోగం అవుతున్నారు.. అతను మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని మంజ్రేకర్ సూచించాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా.. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 50 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో 17 ఏళ్ల తర్వాత ఆర్సీబీ చెన్నై చెపాక్ కోటను బద్దలు కొట్టింది. దీంతో బెంగళూరు ఫ్యాన్స్ ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. ఈ విజయం అనంతరం.. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన సహచరులతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన కొత్తలో తనకు అస్సలు నచ్చలేదని, అవసరం లేదనిపించిందని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపారు. ఆటలో పాలుపంచుకోవడం తనకు ఇష్టం అని, ఇప్పటికీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు అవసరం లేదన్నారు. ఇంపాక్ట్ రూల్ వల్ల మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయని చాలా మంది అనడంలో నిజం లేదని, ఆటగాళ్ల మైండ్ సెట్ మారడంతోనే పెద్ద స్కోర్స్ సాధ్యమవుతున్నాయని ధోనీ చెప్పుకొచ్చారు.…