ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కి ఎంఎస్ ధోని మరింత సహకారం అందించగలడని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ధోని జట్టుకు తక్కువ ఉపయోగం అవుతున్నారు.. అతను మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని మంజ్రేకర్ సూచించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ధోనిని 9వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపింది. 13వ ఓవర్‌లో 6 వికెట్లకు 80 పరుగుల వద్ద శివమ్ దూబే అవుట్ కాగానే.. ధోనిని కాకుండా అశ్విన్‌ను బ్యాటింగ్‌కు పంపడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అప్పటికే సీఎస్కే రన్ రేట్ 15కు పైగా ఉండటంతో.. 16వ ఓవర్‌లో అశ్విన్ 8 బంతుల్లో 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ధోని బ్యాటింగ్‌కు వచ్చిన సమయానికి మ్యాచ్ చేయి జారిపోయింది. 16 బంతుల్లో 30 పరుగులతో ధోని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివరి నాలుగు బంతుల్లో 66 పరుగులు కావాల్సి ఉండగా.. ధోని భారీ షాట్లు కొట్టినా ఎలాంటి ఫలితం లేదు. ఈ క్రమంలో సీఎస్కే ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు ధోని ముందుగా బ్యాటింగ్‌కు రావాల్సిందని భావిస్తున్నారు. దీనిపై స్పందించిన మంజ్రేకర్.. ధోనిని జట్టు సరైన విధంగా ఉపయోగించుకోవడం లేదని తెలిపాడు. “ధోని ఆటగాడిగా కంటే ఇప్పుడు బ్రాండ్‌గా మారిపోయాడు. చెన్నై ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేసేటప్పుడు, అతనికి అదనపు బాధ్యతలు ఇవ్వడం లేదు. అతను జట్టుకు బోనస్ ప్లేయర్‌గా మారిపోయాడు. అందుకే.. ధోని తక్కువ ఓవర్లలో మాత్రమే బ్యాటింగ్ చేస్తున్నాడు. అందుకోసం.. అతను మళ్లీ కెప్టెన్ కావాలని నేను అనుకుంటున్నాను. కీపర్‌గా అతను గొప్పగా రాణిస్తున్నాడు.. కెప్టెన్‌గా అయితే మరింత ప్రభావం చూపుతాడు”, అని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.
Read Also: USA: ఇండియన్స్‌కి షాక్.. “గ్రీన్ కార్డ్” ప్రాసెసింగ్‌ను నిలిపేసిన యూఎస్
ధోని ఇప్పటికీ తన క్లాసిక్ ఫినిషింగ్ టచ్‌ను కొనసాగిస్తున్నప్పటికీ.. అతను ఎక్కువగా చివరి ఓవర్లలో మాత్రమే బ్యాటింగ్‌కు వస్తున్నాడు. 2024 ఐపీఎల్‌లో కూడా అతను 200+ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసినా.. కీలక సమయాల్లో ముందుగా బ్యాటింగ్‌కు రావడం మానేశాడు. 2023 ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుని రుతురాజ్ గైక్వాడ్‌కు బాధ్యతలు అప్పగించాడు. అయితే, సీఎస్కే గత ఏడాది ప్లేఆఫ్‌కి చేరలేకపోయింది. దీంతో.. రుతురాజ్ నాయకత్వంలో చెన్నై మళ్లీ అదే పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం ఓటముల పరంపరను ఎదుర్కొంటూ ఉండటంతో.. ధోని తిరిగి కెప్టెన్సీ చేపట్టాలనే డిమాండ్ అభిమానుల నుంచి పెరుగుతోంది. మంజ్రేకర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ధోని స్టంప్స్ వెనుక పదునైన ఆటతీరును కొనసాగిస్తున్నప్పటికీ.. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం ద్వారా జట్టును మరింత బలంగా మార్చగలడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ధోని మళ్లీ కెప్టెన్సీ చేపడతాడా? లేక తన ఫినిషింగ్ రోల్‌లోనే కొనసాగుతాడా? అనే ప్రశ్నకు సమాధానం వచ్చే రోజుల్లో తెలుస్తుంది.