MS Dhoni: “ధోనీ ఆలోచన అదే”.. రిట్మైర్మెంట్‌పై సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ అంశంపై స్పందించిన గావస్కర్
- జట్టు ప్రయోజనం కోసం నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం
- విభిన్నంగా స్పందించిన సునీల్ గావస్కర్
- సీఎస్కేకు ఏది మంచిదైతే ధోనీ అదే చేస్తాడని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌కు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయి. ధోనీ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఆ వార్తలకు మాత్రం ఫుల్‌స్టాప్ ఉండదు. అంతర్జాతీయ క్రికెట్‌కు చాలా సులభంగానే వీడ్కోలు పలికేసిన ధోనీ ఐపీఎల్ కు మాత్రం అంత త్వరగా దూరం కాలేకపోతున్నాడు. వయసు 43 దాటేసినా, ఆరోగ్యం సహకరించకపోయినా ఐపీఎల్ ఆడేందుకే మొగ్గు చూపుతున్నాడు. ధోనీకిదే చివరి సీజన్ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్న వేళ.. క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మాత్రం విభిన్నంగా స్పందించాడు. ధోనీ తీసుకొనే నిర్ణయం ఎప్పుడూ సరిగ్గానే ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
Also Read
ఏ ప్లేయర్ అయినా సరే తన కంటే తాను ప్రాతినిధ్యం వహించే జట్టు ప్రయోజనం కోసం నిర్ణయాలు తీసుకుంటాడని సునీల్ గావస్కర్ అన్నాడు. ఈ సీజన్ తర్వాత ధోనీ ఆడాలా? లేదా? అనేది ఆయనే నిర్ణయించుకుంటాడన్నారు. సీఎస్కేకు ఏది మంచిదైతే ధోనీ అదే చేస్తాడని.. భవిష్యత్తులోనూ ఏదైనా డెసిషన్ తీసుకుంటే సీఎస్కే మంచిదా? కాదా? అనే ఆలోచిస్తాడని సునీల్ చెప్పాడు. సీఎస్‌కే గురించి ముందుగా ఆలోచించిన తర్వాతే తనకు మంచిదా? కాదా? అనేది ఆలోచిస్తాడని తెలిపాడు.
READ MORE: Karumuri Nageswara Rao: ప్రధాని మోడీ ఏదో ఇస్తారని ఆశించాం.. కానీ, పవన్‌కి చాక్లెట్ ఇచ్చారు..!
‘‘ఈ సీజన్‌లో సీఎస్కే ఆటతీరులో పెద్దగా దూకుడుగా లేదు. ఆ జట్టు బౌలింగ్ ఇబ్బందికరంగా ఉంది. వచ్చే సీజన్‌లో బలంగా దూసుకురావాలంటే బౌలింగ్‌పై దృష్టిపెట్టాలి. ఆక్షన్ స్ట్రాటజీలో ఈసారి కాస్త వెనుకబడినట్లు అనిపిస్తోంది. టాలెంట్‌ను గుర్తించే క్రమంలో ఇతర జట్ల కంటే సీఎస్కే మెరుగు కావాల్సి ఉంది. కేవలం బ్యాటర్లపైనే ఆశలు పెట్టుకోకూడదు. బౌలింగ్ చాలా కీలకం.’’ అని సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు. కాగా.. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరు సరిగ్గా లేదు. ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయిన సీఎస్కే ఇవాళ చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!