ఐపీఎల్ 16వ సీజన్ లో ఇవాళ రెండో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. అయితే ఘన విజయంతో ముంబై ఇండియన్స్ దూకుడు మీదుంటే.. లీగ్‌లో తొలిసారి గుజరాత్ టైటాన్స్ ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఐపీఎల్ లో నాలుగు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఛాంపియన్ గా నిలబెట్టిన మహేంద్ర సింగ్ ధోని మరోసారి సీఎస్కేకు టైటిల్ అందించాలని ఆ జట్టు మాజీ ఆటగాడు సురేశ్ రైనా అన్నాడు. సీఎస్కే పదోసారి ఐపీఎల్ టైటిల్ పోరులో నిలవడం పట్ల ఆయన సంతోసం వ్యక్తం చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ప్లే ఆఫ్స్ మ్యాచ్ ల సందర్భంగా బీసీసీఐ.. ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్ టాటా కలిసి ఒక నూతన కార్యక్రమానికి తెరతీశాయి. Green Campaign పేరిట ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో ప్రతీ డాట్ బాల్‌కు 500 మొక్కలు నాటాలని నిర్ణయించారు.
మహేంద్ర సింగ్ ధోనిపై ఉన్న అభిమానం మరొక ఎత్తు అని చెప్పొచ్చు. ఈ సీజన్‌లో మహేంద్రుడి క్రేజ్ ఎలా ఉందంటే అతను ఒక్క బంతి ఆడినా చాలు మాకు అదే మహాభాగ్యం అన్నట్లుగా ధోని అభిమానులు పరవశించిపోతున్నారు. అయితే ఎంఎస్ ధోని క్రేజ్‌కు ప్రత్యర్థి బౌలర్లు ఒత్తిడిలో సరైన బంతులు వేయడంలో వరుసగా విఫలమవుతున్నారు.
ఇన్నింగ్స్ 12వ ఓవర్లో సుయాశ్ శర్మ వేసిన ఐదో బంతిని శివమ్ దూబే ఎక్స్‌ట్రా కవర్స్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. అక్కడే కేకేఆర్ చీర్‌గర్ల్స్ కూర్చొని ఉండగా వారి వద్దకే బంతి నేరుగా వెళ్లి పడింది. బంతి వెళ్లి ఒక చీర్‌గర్ల్‌కు తాకింది. దీంతో పాపం బంతి స్పీడుగా వచ్చి తగలడంతో నొప్పితో విలవిల్లాలాడిన చీర్‌గర్ల్ బాల్ తగిలిన చోట రాసుకోవడం కనిపించింది.
ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్న మహీ భారత జట్టుకు హెడ్ కోచ్ గా రావాలని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. భారత జట్టు హెడ్ కోచ్ గా ధోనీ వచ్చే అవకాశం ఉందన్నట్లుగా ఓ చిన్న హింట్ మాత్రం ఇచ్చాడు.
సీఎస్కే బౌలర్లు అందరు విఫలమయినప్పటికీ ఎక్కువ ఫోకస్ మాత్రం తుషార్ దేశ్ పాండే వైపు వెళ్లింది. కేవలం 4 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చుకుని మూడు వికెట్లు తీశాడు. వికెట్లు తీసినప్పటికీ ధారళంగా పరుగులు ఇవ్వడం తుషార్ వీక్ నెస్ గా మారింది. ఇన్సింగ్స్ 16వ ఓవర్ లో తుషార్ దేశ్ పాండే 20 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లకి 200 పరుగులు చేసింది. 201 పరుగుల లక్ష్య ఛేదన కోసం రంగంలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు పరుగుల వరద పారిస్తున్నారు. 10 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయిన 94 పరుగులు చేసింది.
నేనా నా కెరీర్ లో చివరి దశలో ఉన్నాను అని ఎంఎస్ ధోని వ్యాఖ్యానించాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు.. కాబట్టి ప్రతీ మ్యాచ్ ను నేను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నాను.. నాకు చెన్నైతో విడదీయరాని అనుబంధం ఉంది.