బ్యాటింగ్ వైఫల్యంతోనే గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమిపాలయ్యామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో బుధవారం జరిగిన మ్యాచ్ లో చెన్నై 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ధోని.. మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ రేట్ రొటేట్ చేయడంలో తమ బ్యాటర్లు విఫలమయ్యారని.. ఆ తప్పిదమే తమ ఓటమిని శాసించిందని ధోని చెప్పుకొచ్చాడు.
IPL Tickets Issue: తమిళనాడులో ఇప్పుడు ఐపీఎల్ టికెట్లు, చెన్నై సూపర్ కింగ్స్ కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయి. ఇప్పటికే సీఎస్కే టీం ను బ్యాన్ చేయాలని పలువురు రాజకీయ నాయకులు, పార్టీలు కోరతున్నాయి. పీఎంకే శాసనసభ్యుడు ఏకంగా తమిళనాడు అసెంబ్లీలోనే సీఎస్కేని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
CSK doesn't have any players from TN, should be banned: తమిళనాడులో భాషాభిమానం, ప్రాంతీయాభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ భాషకు ఎలాంటి అగౌరవం వాటిల్లినా అక్కడి ప్రజలు, ప్రభుత్వాలు భగ్గుమంటాయి. ముఖ్యంగా హిందీ మాట్లాడితే ఏదో పాపం చేసినట్లు చూస్తుంటారు కొందరు.
న్యూమరాలజీ ప్రకారం ఐపీఎల్ 2023లో ప్లే ఆఫ్స్ చేరే జట్లు ఏవో తెలుసా.. ప్రముఖ న్యూమరాలజిస్ట్ అంచనా ప్రకారం ఈ సారి ప్లే ఆఫ్స్.. ఫైనల్స్ కి చేరబోయే జట్లు ఇవేనంటా.. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్.. అని చెప్పారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2023లో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యా్చ్ లో పేసర్ దీపక్ చాహర్ను కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ శనివారం చేదు అనుభవం ఎదుర్కొంది.
రహానేకు వెళ్లి ఎంజాయ్ చేయమని చెప్పాను, ఒత్తిడి తీసుకోకండి మరియు మేము మీకు మద్దతు ఇస్తాము. అతను బాగా బ్యాటింగ్ చేసాడు మరియు అతను ఔట్ అయిన విధానంతో అతను సంతోషంగా లేడని ధోని తెలిపాడు. నేను ప్రతి గేమ్ ముఖ్యమని భావిస్తున్నాను, మీరు చూడండి మీ ముందున్న సమస్యలపై ఒక అడుగు వేయండి.. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికను చూడకండి అని ధోని చెప్పుకొచ్చాడు.
చెన్నై విమానాశ్రయంలో సీఎస్కే టీమ్ ఫ్లైట్ ఎక్కింది. అయితే ఈ విషయం తెలుసుకున్న పైలెట్ విమానం టేకాఫ్ అయ్యే ముందు ఓ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. అలా ధోనీతో ఆ పైలెట్ మాట్లాడాడు. ఎంఎస్ ధోని నేను మీకు పెద్ద అభిమానిని.. దయచేసి ఇంకొంత కాలం మీరు సీఎస్కే టీమ్ కు కెప్టెన్ గా కొనసాగండి.. ఈ సారి మాత్రం మీరు రిటైర్మెంట్ ప్రకటించొద్ద అంటూ కోరాడు.
ఈ ఏడాది సీజన్ కు దూరమైన రిచర్డ్ స్థానంలో మరో ఆసీస్ పేసర్ రిలే మెరెడిత్ ను ముంబై ఇండియన్స్ భర్తీ చేసింది. కనీస ధర రూ. 1.5 కోట్ల మెరెడిత్ తో ముంబై టీమ్ ఒప్పందం కుదుర్చుకుంది.
మహేంద్ర సింగ్ ధోని బ్యాక్ టూ బ్యాక్ సిక్సర్లుగా కొట్టాడు. అంతే ధోని అభిమానులను కరిగిపోయేలా చేసింది. ఆ రెండు సిక్సర్లతో ఎంజాయ్ చేశారని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు.