ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. కొత్త సీజన్, కొత్త రోల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. వేచి ఉండండి అంటూ ఇవాళ అతను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు.
Devon Conway To Miss IPL 2024 Due to injury: ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. చెన్నై స్టార్ ఓపెనర్, న్యూజీలాండ్ క్రికెటర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా ఐపీఎల్ 17 సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. ఎడమ బొటన వేలికి శస్త్రచికిత్స అవసరం అని వైద్యులు చెప్పారు. శస్త్రచికిత్స అనంతరం అతడికి 8 వారాలు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఈ విషయంపై అధికారిక ప్రకటన…
ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్ లాంటిది. ఐపీఎల్ 17వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 22న హోమ్ గ్రౌండ్ ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో చెన్నై తలపడనుంది. మొత్తం.. 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. సాధారణంగా డిఫెండింగ్ చాంపియన్- రన్నరప్ మధ్య మ్యాచ్‌తో క్యాష్ రిచ్ లీగ్ కొత్త ఎడిషన్ ఆరంభించడం…
MS Dhoni New CSK Jersey Goes Viral: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఎడిషన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు కొత్త స్పాన్సర్ వచ్చింది. యూఏఈ చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్.. సీఎస్‌కేతో ఒప్పందం కుదుర్చుకుంది. చెన్నైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ భాగస్వామ్యానికి సంబధించిన జెర్సీని ఆవిష్కరించారు. ముందుగా చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ జెర్సీని లాంచ్ చేశారు. కెప్టెన్ కూల్ ఈవెంట్‌లో భాగం కాలేదు కానీ.. అతని జెర్సీని మాత్రం…
MS Dhoni visits Deori Maa Temple in Ranchi: భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ మంగళవారం రాంచీలోని పవిత్ర దేవరీ మా ఆలయాన్ని సందర్శించారు. అభిమానుల మధ్య క్యూ లైన్‌లో నిల్చొని మరీ.. అమ్మవారిని మహీ సందర్శించారు. దేవరీ మా ఆలయంలోని దుర్గాదేవికి ధోనీ ప్రత్యేక పూజలు చేశారు. ఆపై అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. అభిమానులు ధోనీతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. చెన్నై…
CSK Bowler Deepak Chahar React on MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మోకాలి గాయం నుంచి కోలుకున్నాడని, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో 2-3 సీజన్‌లు ఆడగలడని చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ దీపక్ చహర్ చెప్పాడు. ధోనీ లేకుండా చెన్నై జట్టును ఊహించడం కష్టమే అని, సీఎస్‌కే అంటేనే మహీ భాయ్ అని పేర్కొన్నాడు. లాక్‌డౌన్ సమయంలో ఇద్దరం కలిసి పబ్‌జీ ఆడేవాళ్లమని టీమిండియా పేసర్ దీపక్…
CSK Coach Stephen Fleming opened up on Daryl Mitchell Buy: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీని భర్తీ చేయడంపై ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. గత పదేళ్లుగా ధోనీ వారసుడి కోసం వేట కొనసాగుతోందని చెప్పాడు. ప్రతి ఏడాది చెన్నై కెప్టెన్సీ చర్చగా మారుతోందని, అయితే కెప్టెన్ కూల్ ధోనీ మాత్రం ప్రతి ఏడాది జట్టును అత్యుత్తమంగా నడిపిస్తున్నాడని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. ఫ్లెమింగ్ మాటలను బట్టి చూస్తే.. ఐపీఎల్…
CSK Buy Telangana Cricketer Aravelly Avinash Rao in IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ కోసం జరిగిన వేలంలో తెలంగాణకు చెందిన క్రికెటర్‌కు అవకాశం దక్కింది. మంగళవారం జరిగిన వేలంలో సిరిసిల్లకు చెందిన అరవెల్లి అవనీశ్ రావును చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ కొనుగోలు చేసింది. అవనీశ్ని అతడి కనీస ధర రూ. 20 లక్షలకు చెన్నై తీసుకుంది. వేలం చివర్లలో ఈ 18 ఏళ్ల హర్డ్ హిట్టర్,…
ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ప్రేక్షకులను అలరించేందుకు ఐపీఎల్ సీజన్ రెడీ అవుతుంది. అయితే, ఇప్పటికే ప్లేయర్ల ట్రేడింగ్‌తో ఐపీఎల్ పండుగకు అంతా సిద్ధం అవ్వగా.. మరి కొద్ది రోజుల్లో మిని వేలం స్టార్ట్ కానుంది. డిసెంబర్ 19న దుబాయ్ లో ఈ మినీ వేలం జరగనుంది.