GT vs CSK Qualifier-1: ఒక్క ప్లే ఆఫ్స్ లో 84 డాట్ బాల్స్.. 42వేల మొక్కలు నాటనున్న బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ప్లే ఆఫ్స్ మ్యాచ్ ల సందర్భంగా బీసీసీఐ.. ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్ టాటా కలిసి ఒక నూతన కార్యక్రమానికి తెరతీశాయి. Green Campaign పేరిట ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో ప్రతీ డాట్ బాల్‌కు 500 మొక్కలు నాటాలని నిర్ణయించారు. అందుకే మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్ లో బౌలర్ రన్స్ ఇవ్వకుండా ‘డాట్ బాల్’ వేసిన సమయంలో టీవీ స్కోరు బోర్డులో సున్నాకు బదులుగా ఒక పచ్చని మొక్క చూపిస్తూ వచ్చారు.
Also Read : Haj Flights from Vijayawada: హజ్ యాత్రికులకు సర్కార్ గుడ్‌న్యూస్.. విజయవాడ నుంచి విమానాలు..
Also Read
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
కాగా ఈ మ్యాచ్‌లో మొత్తం 84 డాట్‌బాల్స్ నమోదు అయ్యాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో 34.. మిగతా 50 డాట్‌బాల్స్ గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్‌లో వచ్చాయి. ప్రతీడాట్ బాల్‌కు 500 మొక్కలు చొప్పున 84 డాట్‌బాల్స్‌కు 42వేల మొక్కలు నాటనున్నట్లు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా స్వయంగా తన ట్విటర్ అకౌంట్ లో పోస్ట్ పెట్టాడు. ఇక ఈ మొక్కల కాన్సెప్ట్ మిగతా మూడు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకూ(ఫైనల్‌తో కలిపి) వర్తించనుంది. దీంతో ప్లేఆఫ్ మ్యాచ్‌లు ముగిసేలోపే లక్షల్లో మొక్కలను నాటే సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బీసీసీఐ, టాటా కలిపి చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి ప్రశంసలతో పాటు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన దొరుకుతుంది.
Also Read : IT companies: సాఫ్ట్‌వేర్ కలలకు సంక్షోభం దెబ్బ.. 40 శాతం తగ్గనున్న క్యాంపస్ నియామకాలు..
ఇక.. మంగళవారం నాడు జరిగిన క్వాలిఫయర్ -1 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 14 పరుగుల తేగాతో విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ఫైనల్ కు చేరిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు సృష్టించింది. ఈ సీజన్ తో కలిపి ఇప్పటివరకు మొత్తం 14 సీజన్ లలో 10సార్లు ఫైనల్ కు వెళ్ళింది. 4సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై.. అత్యధికంగా 12 సార్లు ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది.
We are proud to partner @TataCompanies in planting 500 saplings for each dot ball in the @IPL playoffs. Qualifier 1 #GTvsCSK got 42,000 saplings, thanks to 84 dot balls.
Who says T20 is a batter’s game? Bowlers’ it’s all in your hands #TATAIPLGreenDots 🌳 🌳 🌳
— Jay Shah (@JayShah) May 24, 2023

తాజావార్తలు
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!