విశాఖపట్నంలోని సాగరమాల ఆడిటోరియంలో బీజేపీ సోషల్ మీడియా వాలంటీర్ల సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురందేశ్వరి, ఆరు రాష్ట్రాల శంఖనాధ్ ఇన్ చార్జ్ దావల్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దగ్గబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు అనే ప్రచారాన్ని తిప్పికొట్టాలి అని పిలుపునిచ్చారు. పోలవరం, ప్రత్యేక హోదా విషయంలో దుష్ప్రచారం జరుగుతోంది.. ప్రత్యేక హోదాకు సరిసమానమైన ప్యాకేజీని ఇస్తామంటే అప్పటి ప్రభుత్వం అంగీకరించింది అని ఆమె పేర్కొన్నారు.
Read Also: India-Canada Dispute: మహీంద్రా తర్వాత కెనడాకు షాక్ ఇచ్చిన మరో భారతీయ కంపెనీ
పోలవరం బిల్లులు సకాలం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది అని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. డయాఫ్రామ్ వాల్ డిజైన్ లోపానికి కేంద్రాన్ని ఎలా బాధ్యులను చేస్తారు.. స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కేంద్రాన్ని తప్పుపడుతున్నారు.. పెట్టుబడుల ఉపసంహరణకు బీజేపీ అధికారంలోకి రాక ముందే ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది అని ఆమె తెలిపారు. స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణ జరిగితే సిబ్బంది భవిష్యత్తు బాద్యత మాపై వుంది.. ఏపీలో కక్ష పూరిత రాజకీయాలు చూస్తున్నాము అని పురందేశ్వరి పేర్కొన్నారు.
Read Also: Laddu Chori: చార్మినార్ వద్ద వినాయకుని లడ్డూ మిస్సింగ్.. స్కూల్ కెళ్ళాల్సినోళ్ళు ఏం పనుల్రా అవి?
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి వైసీపీ ప్రభుత్వం నెట్టేస్తోంది అని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మేశామని, ఉద్యోగుల భవిష్య నిధిని తరలించేశామని ఆర్ధిక మంత్రి చెప్పగలిగారా.. నాణ్యత లేని మద్యం తాగించి తద్వారా వచ్చిన ఆదాయాన్ని దోచుకుంటున్నారు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తుపై భయంతో యువత ఏపీ నుంచి తరలిపోతున్నారు.. సమాజంలో జరుగుతోన్న పరిణామాలను, వాస్తవ విషయాలను అందించడంలో సోషల్ మీడియాకు ప్రధాన భూమికి ఉంది.. మహిళా రిజర్వేషన్ బిల్లు మాది అని కొందరుమాట్లాడుతున్నారు.. అప్పట్లోనే చట్టంగా ఎందుకు చేయలేదు అని పురందేశ్వరి ప్రశ్నించారు.