ములుగు జిల్లా కేంద్రంలోని DLR గార్డెన్ లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు ములుగు మండల పరిధిలోని అన్ని గ్రామాలకి సంబందించిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.
Read Also: BJP JDS Alliance: ఎన్డీయేలో చేరిన జేడీఎస్.. స్వాగతిస్తున్నామన్న జేపీ నడ్డా
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. యువకుల బలిదానాలను గుర్తించి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.. తెలంగాణ రాష్ట్రంలో యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని ఆమె పేర్కొన్నారు. లీకేజీల పేరుతో ఉద్యోగుల ప్రశ్న పత్రాలను ప్రభుత్వం అమ్ముకుంటుంది.. గల్లి గల్లికి ఒక వైన్ షాపు, ఇంటింటికి ఒక మద్యం షాపు పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తూ.. యువతను పక్క దారి పట్టిస్తుంది అని సీతక్క తెలిపింది. కరోనా సమయంలో కనిపించని నాయకులు, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ములుగుకి దండయాత్రలుగా వస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది.
Read Also: Botsa Satyanarayana: స్కామ్‌లో వాస్తవాలు తెలుసు కాబట్టే పారిపోతున్నారు..
ములుగు నియోజకవర్గం నా ఇల్లు, ములుగు ప్రజలు నా కుటుంబం అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తాం.. రాబోయే కాలంలో ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తామని ఆమె తెలిపారు. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చుకొని.. రాష్ట్రంతో పేరు బంధంతో పాటు పేగు బంధాన్ని కూడా కేసీఆర్ తెంచుకున్నారు.. ఓట్లప్పుడు పంచుదాం.. అధికారంలోకి రాగానే దోచుదాం అనేది ఇతర పార్టీల సిద్ధాంతం అని సీతక్క అన్నారు.