దక్షిణ తైవాన్‌లోని కాహ్‌సియుంగ్‌లో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన తండ్రితో 50 ఏళ్లకు పైగా నివసించిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. అతని తండ్రి చనిపోవడానికి చాలా కాలం ముందు అతని తల్లి కూడా మరణించింది. దాంతో ఆ మహిళ తన తండ్రితో నివసిస్తుంది. అయితే తండ్రి కూడా చనిపోవడంతో పింఛన్ కోసం తండ్రి మృతదేహాన్ని పాతిపెట్టకుండా ఇంట్లోనే చాలా ఏళ్లుగా దాచి పెట్టింది. గత సంవత్సరం నవంబర్‌లో, డెంగ్యూ వ్యతిరేక…
దేశంలో అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడో చోట గ్యాంగ్ రేప్‌లు, చిన్నపిల్లలపై అత్యాచారాలు పేట్రేగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. కామాంధులు ఆగడం లేదు.
అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు ఇటీవల అంతర్రాష్ట్ర వ్యభిచార ముఠాను ఛేదించారు. 10 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల నలుగురు మైనర్ బాలికలను రక్షించారు. ఈ మేరకు ఓ సీనియర్ పోలీసు అధికారి శుక్రవారం వెల్లడించారు.
Engagement Off: కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన నిశ్చితార్థం ఆగిపోయిందనే కోపంతో అమ్మాయి తల నరికి, ఆ తలతో పారిపోయిన ఘటన రాష్ట్రంలోని మడికేరిలో జరిగింది
రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మొదట తన తండ్రిని గొంతుకోసి చంపాడు. అనంతరం తన 5 ఏళ్ల కొడుకుతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని పాలి ప్రాంతంలో విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి మొదట తన తండ్రిని గొంతు కోసి హత్య చేసి, ఐదేళ్ల కొడుకుతో కలిసి చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు.
ఢిల్లీలోని పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బేకరీ నిర్వాహకుడిపై ముగ్గురు అన్నదమ్ములు కత్తులతో దాడికి పాల్పడ్డారు. బాధితుడు శశి గార్డెన్లో నివాసముంటున్నాడు. అయితే.. తన ఇంటి పక్కన ఉండే అక్రమ్ అనే వ్యక్తి తనపై కార్పొరేషన్‌తో పాటు ఇతర విభాగాల్లో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడని బాధితుడు ఆరోపించాడు. అంతేకాకుండా.. బేకరీ కారణంగా తన ఇల్లు వేడి అవుతుందని.. బేకరీని మూసివేయాలని ఒత్తిడి తెచ్చినట్లు బాధితుడు పేర్కొన్నాడు.
అమెరికాలోని టెక్సాస్‌లో దారుణమైన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సవన్నా క్రీగర్ అనే 32 ఏళ్ల మహిళ తన 3 ఏళ్ల కుమారుడిని కాల్చి చంపి, ఆ తర్వాత తుపాకీతో తనకు తాను కాల్చుకుంది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయే ముందు తల్లి ఫోన్లో భయంకరమైన వీడియోను రికార్డు చేసింది. 'మీ తండ్రికి వీడ్కోలు చెప్పు' అంటూ వీడియోలో రికార్డైంది.