Tragedy: విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా సముద్ర తీరంలో గడిపేందుకు వచ్చిన ఇద్దరు యువకులు సముద్రంలో మునిగి మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరం వద్ద చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన 10 గోల్డ్ వర్కర్స్ సరదాగా గడిపేందుకు రామాపురం సముద్ర తీరానికి వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తు్ండగా.. అలలు తాకిడికి పడవల బాల సాయి (24), కొసనం బాలు(24) గల్లంతయ్యారు. కొద్దిసేపటికి ఇద్దరు యువకుల మృతదేహాలు ఒడ్డుకు చేరాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Also: Cancer: 40 ఏళ్లలోపు భారతీయుల్లో క్యాన్సర్ ముప్పు.. ఫుడ్, లైఫ్ స్టైల్‌లే కారణం..