CRIME: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. తమ భాగస్వాములు సెక్స్‌కి నిరాకరించడంతో, ఇద్దరు వ్యక్తులు 13 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేసి హత్య చేశారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పవిత్ర రంజాన్ మాసం కావడంతో నిందితుల పార్ట్‌నర్స్ శృంగారం చేయడానికి నిరాకరించారు. దీంతో మార్చి 5న జిమ్‌కి వెళ్తున్న బాలుడిని నిందితులు అజార్, హుస్సేని కిడ్నాప్ చేసి, అడవికి తీసుకెళ్లి కట్టేసి బెదిరించినట్లు డీసీపీ బ్రజేంద్ర ద్వివేది వెల్లడించారు.
ఆ తర్వాత బాలుడిపై అత్యాచారం చేసి, తాడుతో గొంతు బిగించి చంపారు. మృతదేహాన్ని బావిలో పడేసినట్లు నిందితుడు హుస్సేని పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత వారు అతనిపై అత్యాచారం చేసి, తాడుతో గొంతు కోసి చంపి, మృతదేహాన్ని బావిలో పడేశారని హుస్సేని అరెస్టు తర్వాత పోలీసులకు చెప్పాడు. అజార్ ఇంకా పరారీలో ఉన్నాడు మరియు అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Read Also: Madness for reels: ఇదేం పిచ్చి.. రీల్స్ కోసం గ్యాస్ సిలిండర్ లీక్, ఇళ్లు ధ్వంసం..
అరెస్ట్ అయిన నిందితుల్లో ఒకరైన హుస్సేని విచారణలో.. ‘‘నా గర్ల్‌ఫ్రెండ్, అజార్ భార్య రంజాన్ సమయం కావడంతో తమతో వారు సెక్స్ చేయడానికి నిరాకరించారు. కానీ మేము వారితో సెక్స్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాము. రంజాన్ ముగిసే వరకు ఈ ఇద్దరూ మాతో శృంగారం చేయకుంటే ఎలా అని ఆలోచించి, మేము 13 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేశాము’’ అని చెప్పాడు.
ఇద్దరు నిందితులు కూడా బాలుడిని కాల్-గర్ల్ ని కలవడానికి తీసుకెళ్తున్నామని మాయమాటలు చెప్పారు. మార్చి 5న బాలుడు అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. మరుసటి రోజు ఉదయం, బాలుడి నివసించే ప్రాంతంలోనే నివసించే హుస్సేని, బాలుడి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి, కిడ్నాపర్లు ఏదైనా మెసేజ్ పంపారా..? అని, వారి ఫోన్లు చెక్ చేసుకోమని చెప్పాడు. కుటుంబీకులు మొబైల్ ఫోన్ చెక్ చేయగా, బాలుడి మామ ఫోన్‌లో రూ. 10 లక్షలు డబ్బు కావాలంటూ కోరుతూ మెసేజ్ కనిపించింది.
బాలుడు కిడ్నాపైన రోజు రాత్రి హుస్సేనీ అదృశ్యమైనట్లు, తెల్లవారుజామున మళ్లీ ఇంటి వద్దే ఉన్నట్లు బాలుడి కుటుంబీకులు గుర్తించారు. పోలీసులు వచ్చి ప్రశ్నించిన తర్వాత, అతడు చెప్పే మాటల్లో తేడాలు కనిపించాయి. చివరకు హుస్సేని లొంగిపోయి, ఆ బాలుడి హత్యలో తనతో పాటు అజార్ ప్రమేయం ఉన్నట్లు ఒప్పుకున్నాడు. హుస్సేనిని అరెస్ట్ చేయగా, అజార్‌ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగున్నట్లు డీసీపీ తెలిపారు.