Crime: తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన భర్త యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లాలో జరిగింది. తిక్రి గ్రామంలో ఈ దాడి జరిగింది. భర్త రామ్ గోపాల్ శుక్రవారం రాత్రి తన భార్య 39 ఏళ్ల రాంగుని, కుమార్తెలైన 16 ఏళ్ల నేహా, 23 ఏళ్ల రచితపై యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో వీరంతా తీవ్రంగా గాయపడ్డారు.
Assam: కుటుంబ వివాదం కారణంగా ఓ వ్యక్తి దారుణ చర్యకు పాల్పడ్డాడు. అస్సాంకు చెందిన వ్యక్తి భార్య తల నరికి, ఆ తలతో పోలీస్ స్టేషన్‌కి వచ్చి లొంగిపోయాడు. ఈ సంఘటన రాష్ట్రంలోని చిరాంగ్ జిల్లాలో జరిగింది. 60 ఏళ్ల బితీష్ హజోంగ్ తన భార్య బజంతి తల నరికి, ఆ తలను తన సైకిల్‌పై పెట్టుకుని, బల్లమ్గురి అవుట్ పోస్ట్ పోలీసుల ముందు లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు.
Shocking: పెళ్లి చేసుకోవాలంటేనే మగాళ్లు భయపడే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో భర్తలు, కాబోయే భర్తల్ని చంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. హర్యానా ఫరీదాబాద్‌కి చెందిన 28 ఏళ్ల వ్యక్తి తన పెళ్లికి రెండు రోజుల ముందు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కాబోయే భర్తపై, మహిళ ప్రియుడు, ఇతరులు దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి ప్రస్తుతం కోమాలో ఉన్నాడు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఓ ఐస్ ఫ్యాక్టరీ యజమాని తన వర్కర్లపై కర్కషంగా ప్రవర్తించాడు. ఇద్దరు కార్మికులను తీవ్రమైన చిత్రహింసలకు గురిచేశాడు. దొంగతనం చేశారనే అనుమానంతో వారిద్దరికి కరెంట్ షాక్‌లు ఇస్తూ, గోళ్లు ఊడపీకి హింసించాడని శనివారం పోలీసులు తెలిపారు. రాజస్థాన్ భిల్వారా జిల్లాకు చెందిన అభిషేక్ భంబి, వినోద్ భంబి అనే ఇద్దరు బాధితులను ఒక కాంట్రాక్టర్ ద్వారా కోర్బా జిల్లాలోని గుర్జార్ యాజమాన్యంలోని ఒక ఐస్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి నియమించుకున్నారు.
కన్న కొడుకే ఆమె పాలిట యముడయ్యాడు. కని పెంచిన కొడుకే కేవలం రూ. 200 కోసం కన్న తల్లినే కడతేర్చాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ విషయం విన్న వారందరూ ఆ కొడుకుపై విరుచుకుపడుతున్నారు. తన వృద్ధ తల్లి ప్రాణాలను తీసిన కొడుకును చూసి అసహ్యించుకుంటున్నారు. కుక్క కొనడానికి రూ.200 ఇవ్వాలని కొడుకు కోరగా.. ఆ తల్లి నిరాకరించిందని అందుకో తన 70 ఏళ్ల తల్లిని కొట్టి చంపాడని పోలీసులు చెబుతున్నారు.
Crime In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం నాడు మూడు హత్యలు జరిగాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలపై బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడింది.
మ్యారేజ్ బ్యూరో పేరిట చేస్తున్న అరాచకాలు విశాఖలో తాజాగా వెలుగులోకి వచ్చాయి. పెళ్లి కాని యువతులను టార్గెట్ చేసి.. మత్తు మందు ఇచ్చి ట్రాప్ చేసి అత్యాచారాలు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ ఘటన నాలుగోవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు స్పృహలో లేని సమయంలో నగ్న వీడియోలు చిత్రీకరించి.. కేటుగాళ్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఓ బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేసినా న్యాయం దక్కలేదు. దాంతో సదరు బాధితురాలు మీడియాను ఆశ్రయించింది.…
Tragedy : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారం ప్రాంతంలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మానసికంగా చితికిపోయిన ఓ తల్లి, తన ఇద్దరు చిన్నారులను వేట కొడవలితో నరికి, అనంతరం బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన మృతిచెందిన తల్లి తేజస్విని రెడ్డిగా, ఆమె కుమారులు హర్షిత్ రెడ్డి (7), ఆశిష్ రెడ్డి (5) గా పోలీసులు వెల్లడించారు. తేజస్విని తన చిన్న కొడుకు ఆశిష్‌కు…
Crime News: మేడ్చల్ జిల్లా అంకుశాపూర్‌లో ఆస్తి గొడవలో బావ కుట్ర బయట పడింది. తన భార్య లావణ్య తమ్ముడు బోనాల ఈశ్వర్ కుటుంబాన్ని హత్య చేయించేందుకు సుఫారీ ఇచ్చినట్లు ఘట్కేసర్ పోలీసులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బోనాల ఈశ్వర్ సోదరి లావణ్యకు 2009లో మేడ్చల్‌కు చెందిన శ్రీనివాస్‌తో వివాహం జరిగింది. అప్పట్లో కట్నంగా ఒక ఎకరం భూమిని ఇచ్చారు. కానీ, 2020లో శ్రీనివాస్–లావణ్య దంపతులు మరింత ఆస్తి కావాలని వాదనలు పెట్టారు.…