Shocking news: పిల్లలు పుట్టడం లేదని వైద్యురాలిని చంపిన అత్తామామలు.. భర్త మర్డర్ ప్లాన్..
- పిల్లలు కలగడం లేదని వైద్యురాలిని చంపిన అత్తమామలు..
- భర్త ప్లాన్‌లో ప్రమాదంగా చిత్రీకరించే యత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking news: పిల్లలు పుట్టడం లేదని, వివాదాల కారణంగా 30 ఏళ్ల వైద్యురాలిని అత్తమామలే దారుణంగా హత్య చేశారు. ఈ హత్యను కప్పిపుచ్చడానికి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో జరిగింది. డాక్టర్ రేణుక సంతోష్ హోనకాండేని ఆమె అత్తమామలు జయశ్రీ, కామన్న హోనకాండే హత్య చేశారు. భర్త కూడా హత్యకు కుట్ర పన్నినట్లు పోలీస్ విచారణలో తేలింది.
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో అత్త జయశ్రీ, రేణుకను కిందకు తోసేసింది, ఆపై రాళ్లతో దాడి చేసింది. మామ కామన్న ఆమె గొంతు నులిమి చంపారు. వీరిద్దరు దీనిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు బైక్ టైర్‌లో చీర చిక్కుకున్నట్లు, ఆమె మృతదేహాన్ని 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లారు. మే 18న జయశ్రీ, రేణుకను గుడికి తీసుకెళ్లిన తర్వాత ఇంటికి వచ్చే సమయంలో రాత్రి పూట హత్య చేశారు.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
అయితే, ఈ ప్లాన్‌లో కేవలం రేణుకకు మాత్రమే గాయాలు ఉండటం, మిగిలిన ఇద్దరికి గాయాలు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి విచారణ చేశామని బెళగావి ఎస్పీ భీమశంకర్ గులేద్ అన్నారు. క్షుణ్ణంగా దర్యాప్తు చేయడంతో జయశ్రీ, కామన్న హత్య చేసినట్లు అంగీకరించారని, వారి కుమారుడు సంతోష్ హోనకాండే రేణుకను చంపడానికి వారిని ప్రేరేపించాడని కూడా అతను చెప్పాడు.
Read Also: Mangaluru: కర్ణాటకలో ఉద్రిక్తత.. సుహాస్ శెట్టి తర్వాత మసీద్ సెక్రటరీ దారుణహత్య..
మహారాష్ట్రలోని సతారాలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సంతోష్, 2020లో రేణుకను వివాహం చేసుకున్నాడు. విజయపుర జిల్లాలోని చడచన్‌కు చెందిన రేణుక డాక్టర్. ఇద్దరు బాగా చదువుకున్నవారు, ఆర్థికంగా స్థిరమైన కుటుంబాలు. వీరి వివాహం తర్వాత నుంచే వివాదాలు ప్రారంభమయ్యాయి. కొన్ని ఏళ్లుగా ఇద్దరు విడివిడిగా జీవిస్తున్నారు. రేణుక ఆరోగ్యం, గర్భం దాల్చకపోవడంపై ఇరు కుటుంబాల మధ్య వివాదాలు జరుగుతున్నాయి.
సంతోష్ మరో వివాహం చేసుకోవడం, రెండో భార్య గర్భం దాల్చడం, హత్యకు చివరి కారణం కావచ్చని పోలీసులు చెబుతున్నారు. రేణుక కుటుంబం కట్నం, పిల్లలు లేకపోవడం వంటి కారణాల వల్ల చాలా కాలంగా వేధింపులకు గురవుతోందని తెలుస్తోంది. ఆమె గర్భం దాల్చలేక పోవడంతో పదే పదే ఆమెను ఎగతాళి చేశారని, ఆమెకు “జ్ఞాపకశక్తి సమస్యలు” ఉన్నాయని ఆరోపణలు వచ్చాయని చెబుతున్నారు. అయినప్పటికీ, రేణుక తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి రాలేదు మరియు తన అత్తమామలతో కలిసి జీవించడం కొనసాగించింది. హత్య, వరకట్న వేధింపుల కేసు నమోదు చేయబడి, ముగ్గురినీ ప్రస్తుతం హిండల్గా జైలులో ఉంచారు.
తాజావార్తలు
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!